ప్రమాదవశాత్తు భారీ కార్చిచ్చుకు కారణమైన ఓ రైతుకు,మహారాష్ట్రలోని ఒక మేజిస్ట్రేట్ కోర్టు ఊహించని శిక్ష విధించింది.
పూర్తి వివరాలలోకి వెళ్ళినట్లైతే మహారాష్ట్ర, సతారా జిల్లాలోని నంద్‌గావ్ గ్రామానికి చెందిన సుభాష్ రాంరావ్ పాటిల్ అనే రైతు ఏప్రిల్ నెలలో తన పొలంలో చెఱుకు పంట కోత అనంతరం వ్యర్థాలను నాశనం చేయడానికి నిప్పంటించాడు. అయితే దుదృష్టవశాత్తు బలమైన గాలుల కారణంగా మంటలు సమీపంలోని అడవికి వ్యాపించాయి. అయితే దీనికి ఆగ్రహం చెందిన అటవీ అధికారులు భారతీయ అటవీ చట్టం కింద ఫిర్యాదు చేసారు.
అయితే ఈ కార్చిచ్చు వ్యాప్తి వల్ల అనేక చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి అందులో ప్రధానంగా మర్రి చెట్లు, వేప చెట్లు,కానుగ మరియు ఇతర అనేక చెట్లు ఉన్నాయి. అయితే ఈ మంటల వలన సుమారుగా 1600 చెట్లకు పైగానే నాశన అయ్యావని అటవీ అధికారులు తెలిపారు.
తీర్పు వివరాలు:
అయితే ఈ కేసును విచారణ చేపట్టిన మహారాష్ట్ర మేజిస్ట్రేట్ కోర్టు తాజాగా తన తీర్పును వెల్లడించింది.ప్రమాదవశాత్తు భారీ కార్చిచ్చుకు కారణమైన రైతు 1,000 మొక్కలు నాటాలని, వాటిని నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అంతే కాకుండా రూ 5,000 జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
మొక్కలు నాటడం మరియు వాటి మనుగడ గురించి సవివరమైన నివేదికను మల్కాపూర్‌లోని అటవీ శాఖ కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమర్పించాలని రైతు సుభాష్ రాంరావ్ పాటిల్ కి అయేషాలు జారీ చేసింది.విచారణ సమయంలో, సుభాష్ రాంరావ్ పాటిల్ తన తప్పును అంగీకరించాడు, అయితే మంటలు సృష్టించడం తన ఉద్దేశ్యం కాదని ప్రమాదవశాత్తు జరిగిందని కోర్టుకి విన్నవించుకున్నాడు.కోర్టు నిర్ణయాన్నితాను స్వాగతిస్తున్నానని ఎందుకంటే ఇది అటవీ సంరక్షణ గురించి ప్రజలకు అవగాహనా తీసుకొస్తుందని రైతు సుభాష్ రాంరావ్ పాటిల్ వ్యాఖ్యానించాడు.
మరిన్ని చదవండి.
Share your comments