News

రైతులకు రూ.1.10 లక్షల కోట్ల అదనపు ఎరువుల సబ్సిడీ: నిర్మలా సీతారామన్!

S Vinay
S Vinay

ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరుగుతూనే ఉన్నందున, ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి అనేక చర్యలను ప్రకటిస్తూ - ధరల పెరుగుదల నుండి రైతులను రక్షించడానికి ₹ 1.10 లక్షల కోట్ల అదనపు ఎరువుల సబ్సిడీని ఇవ్వనున్నట్లు తెలిపింది.

అంతర్జాతీయంగా ఎరువుల ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, ధరల పెరుగుదల నుంచి రైతులను మరింతగా కాపాడేందుకు ప్రభుత్వం ₹ 1.10 లక్షల కోట్ల అదనపు ఎరువుల సబ్సిడీని అందజేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తెలిపారు.దీనితో, ప్రభుత్వ మొత్తం ఎరువుల సబ్సిడీ ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ₹2.15 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరుగుతున్నప్పటికీ, రైతులను ధరల పెరుగుదల నుండి రక్షించడానికి, బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీ ₹ 1.05 లక్షల కోట్లతో పాటు, మన రైతులను మరింత పరిపుష్టం చేయడానికి ₹ 1.10 లక్షల కోట్ల అదనపు మొత్తాన్ని అందించడం జరిగింది అని శ్రీమతి సీతారామన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎరువుల సబ్సిడీ బిల్లు ₹ 2-2.5 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చని చెప్పారు.

2022-23 బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీ బిల్లు ₹1.05 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. ఇది 2021-22లో ₹1,62,132 కోట్లుగా ఉంది.
భారత్ యూరియా, పొటాసిక్, ఫాస్ఫేటిక్ ఎరువులను దిగుమతి చేసుకుంటుండగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగాయి. మరికొన్ని రోజుల్లో మొదలవనున్న వర్షాకాలం (ఖరీఫ్) పంటలు మొదలవనున్న సంగతి తెలిసిందే.

మరిన్ని చదవండి.

అరటిలో వేయదగిన అంతర పంటలు మరియు చేయవలిసిన అంతర కృషి!

దేశవ్యాప్తంగా అధిక దిగుబడినిచ్చే ద్రాక్ష రకాలను తెలుసుకుందాం!

Share your comments

Subscribe Magazine