News

మదనపల్లెలో ప్రాసెసింగ్ టమోటాల సాగు.. ప్రభుత్వ సబ్సిడీలు

Gokavarapu siva
Gokavarapu siva

భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా టమోటలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ టమోటలకు కూరలు చేయడానికి వినియోగించడంతో పాటు అనేక విధాలుగా వాడతారు. ముఖ్యంగా ఈ ఫుడ్ ప్రాసెస్సింగ్ పరిశ్రమల్లో టమోటాలు ఎక్కువగా వాడతారు. ఈ పరిశ్రమల్లో వాడే టమోటాలు సాధారణ వాటితో పోలిస్తే బిన్నంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి ప్రాసెస్సింగ్ టమోటా సాగుపై ద్రుష్టి పెట్టింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టమోటా సాగు అంటే మనకు గుర్తుకు వచ్చేది మదనపల్లె. అలాంటి ఈ మదనపల్లెలో ప్రభత్వం కొత్త రకం టమోటాలను సాగు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రాంతంలో ఈ కొత్త రకమైన ప్రాసెస్సింగ్ టమోటాలను పండించడానికి రైతులకు సబ్సిడీలను అందించడం మరియు సాగు పెట్టుబడుల్లో రాయితీలను ఇవ్వడం వంటి పనులను ప్రభత్వం చేస్తుంది. ప్రభుత్వం సబ్సిడీలు మరియు రాయితీలు అందిస్తున్నందున రైతులు ఈ కొత్త రకం పంటను వేయడానికి మొగ్గు చూపుతున్నారు.

సాదారణంగా ఈ మదనపల్లెలో పులుపు రకం టమోటాలను సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఈ రకం టమోటాలను సాగు చేయడానికి రూ.1.5 లక్షల నుండి రూ.2 లక్షల వరకు ఒక ఎకరానికి ఖర్చు చేస్తారు. పొలంలో ఈ మొక్కలు నాటడానికి నర్సరీల నుండి కొనుగోలు చేస్తారు. ఈ పొలంలో నేలను దున్నడం, కలుపు తీయడం, మొక్కలకు ఎరువులు వేయడం వంటి పనులు చేస్తూ ఉంటారు.

నీటిని ఆదాయం చేయడం కొరకు ఈ టమోటా మొక్కలకు పైపుల ద్వారా బిందుసేద్యం ఏర్పాటు చేసారు. కోత కోశాక ఈ టమోటాలను మార్కెట్ నుండి విజయవాడ, హైదరాబాద్, నెల్లూరు, ప్రాంతాలకు రవాణా చేస్తారు. ఈ సాధారణ టమోటా సాగు అంతగా లాభాలు ఉండవు. మార్కెట్లో ధర లేకపోతే రైతులకు నష్టాలు కలిగే అవకాశం కూడా ఉంది.

ఇది కూడా చదవండి..

వర్టికల్ ఫార్మింగ్ అంటే ఏమిటి? దీనిని ఎలా చేయాలి..

ఈ ప్రాసెస్సింగ్ టమోటాలు ఎక్కువగా కర్ణాటకలో పండిస్తారు. ప్రభుత్వం రైతులకు సబ్సిడీలు అందించి మదనపల్లె మరియు నిమ్మనపల్లె మండలాల్లో ప్రాసెస్సింగ్ టమోటా సాగును చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ పది ఎకరాల్లో ఈ సాగును చేసారు. ఈ పంట నుండి ఎకరానికి 30 కిలోల దిగుబడి వచ్చింది. పైగా ప్రభుత్వం మల్చింగ్ పేపర్ కొరకు రూ.6,400 సబ్సిడీ అందిస్తుంది. మొక్కల కొనుగోలుపై ఒక్కో మొక్కకు రూ.1 చెప్పున సబ్సిడీ ఇస్తుంది. ప్రభుత్వం ఇన్ని రకాలుగా సహాయం చేస్తున్నందున మదనపల్లె రైతులు ఈ పంటను పండించడానికి మొగ్గుచూపుతారో లేదో చూడాలి.

ఇది కూడా చదవండి..

వర్టికల్ ఫార్మింగ్ అంటే ఏమిటి? దీనిని ఎలా చేయాలి..

Share your comments

Subscribe Magazine

More on News

More