Agripedia

వర్టికల్ ఫార్మింగ్ అంటే ఏమిటి? దీనిని ఎలా చేయాలి..

Gokavarapu siva
Gokavarapu siva

ప్రపంచ జనాభా భారీగా పెరుగుతుంది. ప్రపంచ జనాభా అనేది 2050 నాటికీ 10 బిలియన్ల జనాభాను దాటనుంది. ఇలాంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరికి కావలసిన ఆహారాన్ని సమర్థవంతమైన మరియు తక్కువ ఖర్చుతో అందించడం అనేది సవాలుగా మారుతుంది. వర్టికల్ ఫార్మింగ్ అనేది కాలానికి తగ్గట్టుగా వాతావరణ పరిమితులను తొలగించడంతో పాటు రవాణా సవాళ్ళను కూడా అధిగమించడానికి సహాయపడుతుంది.

మొదటిసారిగా ఈ వర్టికల్ ఫార్మింగ్ పద్దతిని 1915 లో అమెరికన్ జియాలజిస్ట్ గిల్బర్ట్ ఎల్లిస్ బెయిలీ కనుగొన్నారు మరియు 1999 లో కొలంబియా యూనివర్సిటీలో పబ్లిక్ అండ్ ఎన్విరాన్‌మెంట్ హెల్త్ ప్రొఫెసర్‌గా ఉన్న డిక్సన్ డెస్పోమియర్ 1999 లో సవరించారు. దీని స్ఫూర్తిగా తీసుకుని ప్రపంచంలోని అనేక దేశాలు ఈ వర్టికల్ ఫార్మింగ్ ని ప్రారంభించాయి.

ప్రపంచంలో ఉన్న భూభాగం మొత్తంలో కేవలం 11 శాతం కంటే తక్కువ భూమోలో పంటల ఉత్పత్తి అనేది జరుగుతుంది. ప్రపంచ జనాభా అధికంగా పెరుతున్నందున ఇంత తక్కువ భూమిలో పండించే ఆర్హరం సరిపోదు. దీనివలన సాంప్రదాయ వ్యవసాయంపై ఒత్తిడి పెరిగింది. వాతావరణ మరియు పంటలు పండించడానికి తగిన నెలలు లేకపోవడం వాలన ఈ సవాళ్లకు తోడవుతుంది.

ఈ కాలంలో వర్టికల్ ఫార్మింగ్ అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. పైగా ఈ వర్టికల్ ఫార్మింగ్ ద్వారా దిగుబడి అధికంగా పెరుగుతుంది. ఎందుకనగా సాధారణంగా పండించే పంటలు కంటే ఇలా వాతావరణ పరిస్థితులను అదుపు చేసి పండించే పంటలకు తెగుళ్ల సమస్యలు ఉండవు, తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు కాబట్టి వీటికి అధిక దిగుబడి వస్తుంది.

ఇది కూడా చదవండి..

ఆదివాసీలకు ఉపాధి కల్పిస్తున్న విప్పపువ్వు

ఈ వర్టికల్ ఫార్మింగ్ ఎలా చేయాలి?

ఈ వర్టికల్ ఫార్మింగ్ ని చాలా తేలికగా ఇంటిదగ్గర చేయచ్చు. ఎందుకు అంటే దీనికి ఎక్కువ స్థలం కువ అక్కర్లేదు. దీనిని చేయడానికి వాతావరణ పరిస్థితులను నియంత్రించగలగాలి. కృతిమ కాంతిని, నీటిని, ఎరువులను అవసరమైనప్పుడు అందించాలి. బిటితో పాటు ఉష్ణోగ్రతలను కూడా అనుగుణంగా నియంత్రించాలి. నియంత్రిత పర్యావరణాన్ని ఉపయోగించడం వల్ల పక్షులు మరియు కీటకాల నుండి వచ్చే నష్టాలను కూడా తొలగిస్తుంది. హానికరమైన పురుగుమందుల అవసరాన్ని తగ్గించి, ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరుస్తుంది. అనేక సందర్భాల్లో, మట్టిని పూర్తిగా తొలగించి, పోషకాలు అధికంగా ఉండే ద్రావణంతో స్ప్రే చేయబడిన పొరలపై పంటలు పండిస్తారు.

ఈ వర్టికల్ ఫార్మ్ ఏర్పాటు చేయడానికి భూమి ధర మినహా రూ. 110 లక్షల నుండి రూ.150 లక్షల వరకు ఒక ఎకరానికి అవుతుంది. సంప్రదాయ వ్యవసాయంతో పోల్చుకుంటే ఈ వర్టికల్ ఫార్మింగ్ అనేది ఖర్చుతో కూడినది. కానీ ఈ ఉత్పత్తులకు ధరలు కూడా అధికంగా ఉంటాయి.

ఇది కూడా చదవండి..

ఆదివాసీలకు ఉపాధి కల్పిస్తున్న విప్పపువ్వు

Related Topics

vertical farming benefits

Share your comments

Subscribe Magazine