ఎంతోకాలంగా జీతం పెరుగుదల కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది . ఈమేరకు 2.73 (DA/DR) ను పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది .
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ ప్రకటించింది. కరువు భత్యం (DA/DR) 2.73 శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఉన్న 17.29 శాతాన్ని, 20.02 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం నిర్ణయం వల్ల 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. 2021 జూలై ఒకటో తేదీ నుంచి లబ్ది ఉద్యోగులు, పింఛన్‌దారులకు డీఏ వర్తించనున్నది.
జనవరి పెన్షన్ తో కలిపి పెన్షనర్లకు ఫిబ్రవరిలో డీఏ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2021 జూలై నుంచి 2022 డిసెంబర్ నెలాఖరు వరకు బకాయిలను ఎనిమిది విడతల్లో జీపీఎఫ్ ఖాతాలలో జమచేయనున్నట్లు ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Share your comments