News

డిజిటల్ ఇండియా

KJ Staff
KJ Staff

భారతదేశంలో డిజిటలైజేషన్ వేగవంతంగా జరుగుతోందని, దీనివల్ల యువతకు కొత్త తరహా ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని నాబార్డు తెలిపింది. డిజిటలైజేషన్ కావడం వాళ్ళ ఉపాధి పెద్ద ఎత్తున తగ్గుతది అన్నది నిజం కాదని నాబార్డు స్పష్టపరిచింది. 'భవిష్యత్తులో ఇండియాలో ఉద్యోగ అవకాశాలు' పేరిట నాబార్డు విడుదల చేసిన అధ్యయన నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది.

డిజిటలైజేషన్ వైపు కోవిడ్ తర్వాత సుమారుగా 10 కోట్లా మందికిపైగా అడుగులు వేశారని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా చేసింది. వివిధ రంగాల్లో డిజటలైజేషన్ ప్రక్రియ వేగంగా జరుగు తోందని తెలిపింది. 2021లో పలు స్టార్టప్లలో ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటలిస్టులు రూ.3.53 లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టడమే దీనికి నిదర్శనమని పేర్కొంది. 2025 నాటికి దేశీయ డిజిటల్ ఎకానమీ విలువ రూ.80 లక్షల కోట్లకు చేరడమే కాకుం డా 5.5 కోట్ల నుంచి 6 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని| ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.

3వ జెనెరేషన్ టెక్నాలజీతో డిజిటల్ అడ్వర్టైజింగ్, టెక్నాలజీతో బ్యాంకింగ్, బీమా వంటి ఆర్థిక సేవలతో పాటు ఈ కామర్స్, సోషల్ మీడియా, సాఫ్ట్వేర్ రంగాల్లో భారీ మార్పులు తెచ్చిందని తెలిపింది. నాలుగో తరం టెక్నాలజీ అయిన బిగ్ డేటా. మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ కూడా వస్తే తయారీ రంగంతో పాటు వ్యవసాయంలో పెద్ద ఎత్తున ఆటోమేషన్ జరుగుతుందని పేర్కొంది.

ఇది కూడా చదవండి ..

తెలంగాణ ప్రభుత్వం వివిధ విభాగాల్లో 2,391 పోస్టులను భర్తీకి ఆమోదం ..

కోవిడ్ లాక్ డౌన్ తో భారీగా పెరిగిన నిరుద్యోగ సమస్యను డిజిటలైజేషన్ పరిష్కరించినట్లు నాబార్డు పేర్కొంది. దేశవ్యాప్తంగా జనవరి 2020 నాటికీ ఉద్యోగుల సంఖ్య 41 కోట్లు ఉండగా కోవిడ్ దెబ్బతో 2021 జూన్ నాటికి 38.6 కోట్లకు పడిపో యిందని తెలిపింది. ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో స్విగ్గీ వంటి సంస్థలతో పాటు ఓలా, ఉబర్ వంటి ట్రావెల్ సంస్థల్లో గిగ్ వర్కర్లుగా పనిచేయడానికి యువత మొగ్గు చూపుతున్నట్లు పేర్కొంది. ఉదాహరణకు లక్ష కోట్లకు పైగా మార్కెట్ విలువ కలిగిన. క్రొమాటోలో ప్రత్యక్షంగా 5,000 మంది పని చేస్తుంటే, పరోక్షంగా 3.5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పిస్తోంది. వీరికి పని చేసిన సమయాన్ని బట్టి నెలకు రూ. 10,000 నుంచి 30,000 వరకు ఆదాయం పొందుతున్నారు.

ఈ గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని నాబార్డు చెప్పింది. వీరికి పీఎఫ్, గ్రాట్యుటీ, అనారో గ్యానికి గురైతే సెలవులు, ఎర్న్ లీవులు వంటి సామాజిక భద్రత లేదని. ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలంది. పెరుగుతున్న ఆటోమేషన్, రోబోటిక్ విధానానికి అనుగుణంగా యువత నైపుణ్యం పెంచుకోవాలని సూచిం చింది. ఏటా దాదాపు 1.2 కోట్ల మంది యువత డిగ్రీలు చేత పట్టుకొని వస్తు న్నారని, వీరందరికీ మారుతున్న టెక్నాల జీకి అనుగుణంగా 'నైపుణ్యం కల్పించడం అతిపెద్ద సవాల్ అని ఆ నివేదిక పేర్కొంది.

ఇది కూడా చదవండి ..

తెలంగాణ ప్రభుత్వం వివిధ విభాగాల్లో 2,391 పోస్టులను భర్తీకి ఆమోదం ..

Related Topics

digital India

Share your comments

Subscribe Magazine

More on News

More