గ్యాస్ వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ శుభవార్త తెలిపింది. గ్యాస్ సిలిండర్‌పై డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. కానీ దీనికి ఒక షరతు పెట్టింది. అమెజాన్ పే నుంచి గ్యాస్ బుకింగ్, నగదు చెల్లించిన వారికి మాత్రమే ఈ డిస్కౌంట్ వస్తుందని తెలిపింది. రూ.50 మాత్రమే డిస్కౌంట్ లభిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది.
ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.821.5 ఉంది. ఇప్పుడు రూ.50 డిస్కౌంట్ లభిస్తే.. రూ.771కి వస్తుంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధరలు బాగా పెరిగాయి. గత 9 నెలల్లోనే గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.231.50 పెరిగింది. ఈ క్రమంలో వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు డిస్కౌంట్లు ఇస్తున్నాయి.
అమెజాన్ పే నుంచి గ్యాస్ బుకింగ్ ఎలా చేసుకోవాలి?
- అమెజాన్ యాప్ ఓపెన్ చేసి అమెజాన్ పే మీద క్లిక్ చేయాలి
- అక్కడ ఉండే బుక్ మై ఎల్‌పీజీ సిలిండర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత పే నౌ మీద క్లిక్ చేసి గ్యాస్ ఆపరేటర్‌ను ఎంచుకోవాలి
- ఆ తర్వాత ఎల్‌పీజీ ఐడీ ఎంటర్ చేసి గెట్ బుకింగ్ డీటైల్స్ మీద క్లిక్ చేయాలి
- కంటిన్యూ పే మీద క్లిక్ చేసి పేమెంట్ పూర్తి చేయాలి
Share your comments