News

గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. డిస్కౌంట్‌పై గ్యాస్ సిలిండర్

KJ Staff
KJ Staff
LPG Gas Cylinder
LPG Gas Cylinder

గ్యాస్ వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ శుభవార్త తెలిపింది. గ్యాస్ సిలిండర్‌పై డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. కానీ దీనికి ఒక షరతు పెట్టింది. అమెజాన్ పే నుంచి గ్యాస్ బుకింగ్, నగదు చెల్లించిన వారికి మాత్రమే ఈ డిస్కౌంట్ వస్తుందని తెలిపింది. రూ.50 మాత్రమే డిస్కౌంట్ లభిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది.

ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.821.5 ఉంది. ఇప్పుడు రూ.50 డిస్కౌంట్ లభిస్తే.. రూ.771కి వస్తుంది.  ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధరలు బాగా పెరిగాయి. గత 9 నెలల్లోనే గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.231.50 పెరిగింది. ఈ క్రమంలో వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు డిస్కౌంట్లు ఇస్తున్నాయి.

అమెజాన్ పే నుంచి గ్యాస్ బుకింగ్ ఎలా చేసుకోవాలి?

- అమెజాన్ యాప్ ఓపెన్ చేసి అమెజాన్ పే మీద క్లిక్ చేయాలి

- అక్కడ ఉండే బుక్ మై ఎల్‌పీజీ సిలిండర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.

- ఆ తర్వాత పే నౌ మీద క్లిక్ చేసి గ్యాస్ ఆపరేటర్‌ను ఎంచుకోవాలి

- ఆ తర్వాత ఎల్‌పీజీ ఐడీ ఎంటర్ చేసి గెట్ బుకింగ్ డీటైల్స్ మీద క్లిక్ చేయాలి

- కంటిన్యూ పే మీద క్లిక్ చేసి పేమెంట్ పూర్తి చేయాలి

Share your comments

Subscribe Magazine