News

గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీకి చార్జీలు వసూలు చేస్తున్నారా? ఇక ఆ అవసరం ఉండదు.. ఈ నెంబర్‌కి ఫోన్ చేయండి

Gokavarapu siva
Gokavarapu siva

గ్యాస్ సిలిండర్ల ధర ఇప్పుడు సగటు వ్యక్తికి ముఖ్యమైన ఆందోళనగా మారింది మరియు దానితో పాటు, వాటి డెలివరీకి సంబంధించిన ఖర్చులు కూడా గణనీయంగా పెరిగాయి. సిలిండర్ ఇంటికి తెచ్చిస్తే... ఎంతో కొంత డబ్బు అదనంగా చెల్లించాల్సిందే. అంతేకాదు.. ఇల్లు పైఫోర్లో ఉందంటే... ఇంక అంతే సంగతులు. దానికి కూడా అదనంగా చెల్లించాల్సిందే. లేదంటే ఊరుకోరు.

కానీ ఇప్పటి నుండి అలా జరగదు. ఎందకంటే, గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన తర్వాత గ్యాస్ డెలివరీ బాయ్ ఎవరైనా అదనపు డబ్బు డిమాండ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ పౌరసరఫరాల శాఖ హెచ్చరిక జారీ చేసింది. రసీదులో పేర్కొన్న మొత్తం కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదని ఏపీ పౌరసరఫరాల కమిషనర్ శ్రీ హెచ్. అరుణ్ కుమార్ తెలియజేశారు.

LPG పంపిణీ కేంద్రం నుండి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలు, గిరిజన సంఘాలు మరియు పర్వత ప్రాంతాలకు గ్యాస్ సీలిండర్లను పంపిణీ చేయడానికి ఎటువంటి రుసుము ఉండదని ఆయన అన్నారు. ఒకవేళ తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు డబ్బులు అడిగిన డెలివరీ బాయ్స్పై ఫిర్యాదు చేయడానికి టోల్ఫ్రీ నెంబర్ 1967, 1800 2333555 కూడా ఇచ్చారు. ఈ నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే... విచారణ జరిపి.. సదరు డెలివరీ బాయ్స్ చర్యలు తీసుకుంటామని తెలిపారు ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్. అరుణ్కుమార్.

ఇది కూడా చదవండి..

గుడ్ న్యూస్.. త్వరలోనే వారి ఖాతాల్లో నిధులు జమ చేయనున్న ప్రభుత్వం.. ఎప్పుడంటే?

LPG పంపిణీ కేంద్రం నుండి 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న ప్రాంతాలలో ప్రత్యేకంగా ఒక నిర్దిష్ట రుసుమును వసూలు చేయడానికి ప్రభుత్వం ఇటీవల అనుమతిని మంజూరు చేసింది. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేయాలని ఆదేశించారు. ఏపీ పౌరసరఫరాల శాఖ ఆదేశాలను సామాన్యులకు కొంత భారం తగ్గుతుంది. సిలిండర్ డెలివరీ అయినప్పుడల్లా చెల్లించే అదనపు ఛార్జీలు.. ఇక భరించాల్సిన అవసరం ఉండదు.

అయితే కస్టమర్ల ఇళ్లకు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయగానే డెలివరీ బాయ్స్ అదనంగా 20 నుంచి 50 రూపాయలు డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది. డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో ఏపీ గ్యాస్ వినియోగదారులకు కాస్త ఊరట లభించినట్టు అయ్యింది.

ఇది కూడా చదవండి..

గుడ్ న్యూస్.. త్వరలోనే వారి ఖాతాల్లో నిధులు జమ చేయనున్న ప్రభుత్వం.. ఎప్పుడంటే?

Share your comments

Subscribe Magazine