News

రైతు బంధు పథకంలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ?స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

KJ Staff
KJ Staff
Rythu Bandu Scheme
Rythu Bandu Scheme

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కోసం ఆర్థిక సహాయాన్ని అందించేందుకు రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని 59.26 లక్షల మంది రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ పథకం గత మూడేళ్లుగా చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. దీంతో అనేక మంది వ్యవసాయదారుల కుటుంబాలకు అండగా నిలుస్తోంది. ఇదిలా ఉంటే... ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు నిధులను విడుదల చేశారు. జూన్ 15 నుంచి 25 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.5000 పెట్టుబడి మద్ధతును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. దీంతో 2,81,865 మంది రైతులు రాష్ట్ర ప్రభుత్వ రైతు బంధు పథకం కింద 66,311 ఎకరాలకు ఆర్థిక సహాయం పొందుతారు.

వ్యవసాయం శాఖ లెక్కల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో 1,47,026 మంది రైతులకు పెట్టుబడి సహాయం లభిస్తుంది. అలాగే కోమరం భీం ఆసిఫాబాద్ చెందిన మొత్తం.. 1,14,525 మంది రైతులు, 1,70 నిర్మల్ కు చెందిన 994 మంది రైతులు మంచిర్యాలకు చెందిన 1,40,807 మంది రైతులు ఈ పథకంలోకి రానున్నారు.

రైతు బంధును స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి..

1. ముందుగా https://treasury.telangana.gov.in/ link వెబ్ సైట్ కు వెళ్లాలి.
2. ఆ తర్వాత మెనూబార్ లో రైతు బందు స్కీమ్ వివరాల ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
3. ఆ తర్వత సంవత్సరం, భూమి రకం, పీపీబీ నంబర్ ఎంటర్ చేయాలి.
4. ఆ తర్వాత సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
5. ఆ తర్వాత డ్రాప్ డౌన్ జాబితా నుంచి స్కీమ్ వైజ్ రిపోర్ట్ క్లిక్ చేయాలి.
6. ఆ తర్వాత మీ పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి.
7. అనంతరం సంవత్సరాన్ని ఎంచుకోవాలి.
8. పీపీబీ నంబర్ ఎంటర్ చేయాలి.
9. సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

అర్హత...

1. తెలంగాణ ప్రాంత నివాసి అయి ఉండాలి.
2. రైతు భూమి సొంతంగా కలిగి ఉండాలి.
3. రైతు చిన్న ప్రాంతానికి చెందినవారు కావాలి.
4. ఇది బిజినెస్ చేసే రైతులకు వర్తించదు.

సర్టిఫికేట్స్..

1. ఆధార్ కార్డు
2. ఓటరు ఐడి కార్డు.
3. పాన్ కార్డు
4. బీపీఎల్ సర్టిఫికేట్
5. భూ యాజమాన్య పత్రాలు
6. కుల ధృవీకరణ పత్రం.
7. చిరునామా ఫ్రూవ్
8. బ్యాంక్ అకౌంట్ వివరాలు..

హెల్ప్ లైన్ నంబర్..

సంప్రదించాల్సిన నంబర్.. 040 23383520
ఇమెయిల్ ఐడి.. omag-ts@nic.in

Share your comments

Subscribe Magazine