News

సెప్టెంబరు 30 తర్వాత రూ.2,000 నోట్లు చెల్లవ ?

Srikanth B
Srikanth B
సెప్టెంబరు 30 తర్వాత రూ.2,000 నోట్లు చెల్లవ ?
సెప్టెంబరు 30 తర్వాత రూ.2,000 నోట్లు చెల్లవ ?

 


రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా మే 19 నుంచి రూ . 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది , ఇప్పటికి ఎవరిదగ్గరైన 2000 నోట్లు ఉంటే అవి సెప్టెంబర్ 30 వరకు మార్చుకోవాలని వెల్లడించింది .. అయితే ఇది నోట్ల రద్దు కాదని చలామణి నుంచి ఉపసంహరించుకోవడాని RBI గవర్నర్ వెల్లడించారు అయితే ప్రజలలో ఇప్పటికి అనేక సందేహాలు నెలకొన్నాయి సెప్టెంబర్ 30 తరువాత 2000 నోట్లు చెల్లవ అనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ,ఈ నోట్ల మార్పిడికి సెప్టెంబరు 30 వరకు అవకాశం ఇచ్చినా, వాటి చెల్లుబాటు అప్పటివరకే పరిమితం అని తాము ఇంకా ప్రకటించలేదని అన్నారు .

 

 

రూ.50,000కు పైన మాత్రమే ఎవరైనా డిపాజిట్ చేస్తే పాన్ కార్డు వివరాలు ఇవ్వాలని ,రూ.50,000 లోపు వారు ఎలాంటి అప్లికేషన్ లను పూరించాల్సిన అవసరం లేదని అన్నారు . తిరిగి 1000 రూపాయల నోటును ప్రవేశపెడతరన్న వాదనను కొట్టిపారేసిన అయన రూ .1000 నోటును తిరిగి ప్రవేశ పెట్టు అవకాశం లేదని స్పష్టం చేసారు .

కాగా నేటి నుంచి (మే 23) బ్యాంకులు రూ.2,000 నోట్లను మార్చుకునే ప్రక్రియను ప్రారంభించనున్నాయి. వ్యక్తులు తమ రూ.2,000 నోట్లను బ్యాంకుల్లో అందజేయడం ద్వారా ప్రత్యామ్నాయ విలువ నోట్లను పొందగలుగుతారు.

 

ఇదికూడా చదవండి .

బ్యాంకు అకౌంట్ లేకున్నా రూ.2,000 నోట్లను మార్చుకోవచ్చా ?

నోట్లు రద్దు 5 కీలక అంశాలు :

1 మే 23 నుంచి ఏ జాతీయ బ్యాంకు ద్వారా అయినా 2000 నోటును మార్చుకోవచ్చు .
2 సెప్టెంబర్ 30 లోగ 2000 నోట్లను బ్యాంకుల ద్వారా మార్చుకోవాలి .
3 రేపటి నుంచి బ్యాంకులలో 2000 నోట్లు ఇవ్వరాదు .
4 మే 19 నుంచి 2000 నోటు చలామణిలోకి రాదు .
5 2018-2019 లోనే 2000 నోట్ల ముద్రణ నిలిచిపోయింది .

ఇదికూడా చదవండి .

బ్యాంకు అకౌంట్ లేకున్నా రూ.2,000 నోట్లను మార్చుకోవచ్చా ?

Related Topics

#2000 note ban

Share your comments

Subscribe Magazine