నిన్న సాయంత్రం దృశ్య మాధ్యమంలో జరిగిన గ్లోబల్ వెటివర్ లీడర్స్ లో భారతదేశం తరుపున వెటివర్ నెట్‌వర్క్ కు నాయకత్వం వహించడానికి ఫస్ట్ వరల్డ్ కమ్యూనిటీ వ్యవస్థాపకుడు డాక్టర్ సికె అశోక్ కుమార్ ఎంపికయ్యారు.1995లో ప్రారంభించబడిన, ది వెటివర్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ (TVNI) వెటివర్ వేరు యొక్క ప్రాముఖ్యతను ప్రపంచ వ్యాపితం చేయడానికి పనిచేస్తుంది.
నిన్న సాయంత్రం గ్లోబల్ వెటివర్ లీడర్స్ మీటింగ్‌లో వెటివర్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియాకు నాయకత్వం వహించడానికి ఫస్ట్ వరల్డ్ కమ్యూనిటీ చైర్మన్ డాక్టర్ సికె అశోక్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వేటివేర్ యొక్క ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించడానికి అవసరమైన అంశాలపై చర్చకోసం నిన్న కృషి జాగరణ్ నిర్వహించిన మీటింగ్ కు కృషి జాగరణ్, అగ్రికల్చర్ వరల్డ్, ట్రాక్టర్ న్యూస్ అండ్ అగ్రికల్చర్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు మరియు ఎడిటర్ ఇన్ చీఫ్ Mr MC డొమినిక్ తదితరులు హాజరయ్యారు.
భారతదేశంలో వేటివేర్ నెట్‌వర్క్ కు న్యాయకత్వం వహించడానికి డాక్టర్ అశోక్ పేరును శ్రీమతి మమతా జైన్, ఎడిటర్ & సీఈఓ, అగ్రికల్చర్ వరల్డ్ MC డొమినిక్ ప్రతిపాదించారు, ఇటీవల థాయ్‌లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో విడుదలైన VETIVERపై ప్రత్యేక సంచికను అగ్రికల్చర్ వరల్డ్ మ్యాగజిన్ ప్రచురించింది. వెటివర్‌కు వాతావరణ మార్పులను తగ్గించి , మట్టిని రక్షించడానికి మరియు దాని అపారమైన ఔషధ ప్రయోజనాలతో పాటు మన పర్యావరణాన్ని రక్షించే సామర్థ్యం ఉంది.
తెలంగాణాలో మరో పథకం .. మైనారిటీలకు రూ.లక్ష ఆర్థికసాయం..
ఈ మీటింగ్ ది వెటివర్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు "రిచర్డ్ గ్రిమ్‌షా" మాట్లాడుతూ వేటివేరే పై అవగాహన కల్పించడం అవసరమైన శిక్షణ తరగతులు నిర్వహించడం లో ప్రభుత్వాలు కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ మీటింగ్ కు సీనియర్ వెటివర్ నిపుణులు Sh P హరిదాస్, డాక్టర్ M మోని, Mr పతంజలి ఝా, Mr విన్సెంట్ P, Dr ప్రదీప్ కుమార్, Dr బాబులాల్ మహతో, Dr దేవేష్ వాలియా, Mr రాబిన్సన్ వనోహ్, Mr అబ్దుల్ సమద్, Mr Samsun Nabi, డాక్టర్ సుబ్రమణియన్ PN మరియు ఇతరులు పాల్గొన్నారు.
Share your comments