పెరుగుతున్నద్రవ్యోల్బణాన్ని అధిగమించే ప్రయత్నాల్లో భాగంగా, సోయాబీన్ ఆయిల్ మరియు సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకం మరియు సెస్‌ను రెండేళ్లపాటు కేంద్రం మినహాయించింది.
ప్రపంచంలో వంటల నూనెను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారతదేశం ఒకటి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత మరియు ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించిన తర్వాత వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి.ఇప్పుడు, భారతదేశం దాదాపు 13-13.5 మిలియన్ టన్నుల వంట నూనెను దిగుమతి చేసుకుంటుంది, ఇందులో దాదాపు 8-8.5 మిలియన్ టన్నులు పామాయిల్ మాత్రమే ఉంది. కాగా దాదాపు 45% పామాయిల్ ఇండోనేషియా నుండి మరియు మిగిలినది మలేషియా దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నాం.
ఇండోనేషియా 200,000 టన్నుల ముడి పామాయిల్‌ను భారత్‌కు రవాణా చేయడంతో దేశంలో వంట నూనెల లభ్యత మెరుగుపడుతుందని మరియు రాబోయే వారాల్లో వాటి ధరలు తగ్గే అవకాశంఉంది. పామాయిల్ ధరలు తగ్గడం వల్ల దీని ఉత్పన్నాలు అయిన సబ్బులు, వనస్పతి, షాంపూలు, బిస్కెట్లు మరియు చాక్లెట్ల ముడిసరుకు ధర తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతానికి, ఈ వస్తువులను దిగుమతి చేసుకోవడానికి 5%సెస్ ఉంది. తాజాగ తీసుకున్న చర్య వంట నూనెల ధరలను తగ్గిస్తుంది.కాబట్టి వినియోగదారులకు ఉపశమనం కలిగించవచ్చు. పామాయిల్ మరియు సోయాబీన్ నూనెతో సహా దాదాపు అన్ని వంట నూనెలపై బేస్ కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది.
మరో పక్కన తగినంత దేశీయ సరఫరాను నిర్వహించడానికి మరియు ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్రం చక్కెర ఎగుమతులను 100 లక్షల టన్నులకు పరిమితం చేసింది. "చక్కెర మిల్లులు మరియు ఎగుమతిదారులు డైరెక్టరేట్ ఆఫ్ షుగర్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్‌మెంట్ నుండి ఎగుమతి విడుదల ఉత్తర్వుల రూపంలో అనుమతులు తీసుకోవాలి" అని ప్రభుత్వ ప్రకటనలో పేర్కొంది.
మరిన్ని చదవండి.
Share your comments