Agripedia

మామిడి పండ్లను విదేశాలకి ఎగుమతి చేసి మంచి లాభాలను పొందడానికి ఈ సూచనలను పాటించండి.

S Vinay
S Vinay

మన దగ్గర పండే మామిడి పండ్లకి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఈ మామిడి పండ్లను విదేశాలకి ఎగుమతి చేసి మంచి విదేశీ మారక ద్రవ్యాన్ని పొందవచ్చు. అయితే వీటికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వీటిని అపెడ AGRICULTURAL & PROCESSED FOOD PRODUCTS EXPORT DEVELOPMENT AUTHORITY (APEDA) పర్యవేక్షిస్తుంది. apeda నియమించిన నియమాలను పాటించినట్లయితే మామిడిని సులభంగా విదేశాలకి ఎగుమతి చేయవచ్చు. మన మామిడి పళ్ళని ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ,లండన్,కతర్, ఒమన్ మరియు కువైట్ వంటి దేశాలు ఎగుమతి చేసుకుంటున్నాయి. అల్ఫాన్సో, బంగిన పల్లి, కేసరి , చౌసా, మల్లిక మరియు లాంగ్రా వంటి రకాలు ఎక్కువగా ఎగుమతి అవ్వుతున్నాయి.కాబట్టి విదేశీ ఎగుమతి చేసి ఆదాయం గడించాలనుకునే రైతులు ఈ రకాలను పండించడం మేలు.

సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:


  • మొక్కలకి రసాయనిక ఎరువులని తగ్గించి సేంద్రీయ ఎరువులను వాడాలి.

  • కాయలపై లేదా పండ్లపై నేరుగా ఎలాంటి రసాయన మందులను చల్లరాదు.

  • పండు ఈగ మరియు ఆంత్రక్నోస్ సోకకుండా నివారణ చర్యలు చేపట్టాలి.

  • సుమారుగా 300 గ్రాములు ఉన్న పండ్లని ఎంపిక చేసుకోవాలి.

  • పండ్ల పైన దెబ్బలు లేకుండా జాగ్రత్త పడాలి.

  • పండ్లలో బ్రిక్స్ (చక్కర శాతము) శాతం 8 నుండి 9 శాతం వున్న వాటిని ఎంపిక చేసుకోవాలి.
    ఇర్రాడియేషన్ వంటి ప్రక్రియలను చేసుకోవాలి.

తనిఖీ మరియు ధృవీకరణ:
తాజా పండ్లను ఇండియన్ ప్లాంట్ క్వారంటైన్ అథారిటీ తనిఖీ చేస్తుంది,ఎలాంటి తెగుళ్లు లేదా వ్యాధులు సోకలేదు అని నిర్ధారణ జరిగాక ఒక ఫైటోసానిటరీ ధ్రువీకరణ పత్రం జారీ చేయబడుతుంది. దీని ప్రకారం పండ్లకి హానికరమైన ఎటువంటి సూక్ష్మజీవులు సోకలేదు అని మంచి నాణ్యత కలవని నిర్దారిస్తుంది. APEDA వారు జారీ చేసే ధ్రువీకరణ పత్రం అందిన తర్వాతనే విదేశాలకు ఎగుమతి చేసే అనుమతి వస్తుంది. కాబట్టి నిబంధనల ప్రకారం పండ్లని సాగు చేసుకోవాలి.

ప్యాకింగ్ మరియు గ్రేడింగ్:
పండ్లను ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ సంచులను లేదా టేలీస్కోపిక్ కరుగాటెడ్ ఫైబర్ అట్ట పెట్టెలను వాడాలి. (బ్యాగ్ యొక్క గాలి రంధ్రాలు 1.6 మిమీల వ్యాసం కంటే తక్కువగా ఉండాలి. ఒక్కో అట్ట పెట్టెలలో 15 కాయలను ప్యాక్ చేయవచ్చు. అట్ట పెట్టెల పై బాగాన పండ్లకి సంబందించిన ప్రాథమిక వివరాలను పొందుపరచాలి.

మరిన్ని చదవండి.

భూసార పరీక్ష అమలు పరచండి ఇలా

నిమ్మ జాతి చెట్లను అధిక దిగుబడికై సాగు చేయడం ఎలా

Related Topics

mango export APEDA

Share your comments

Subscribe Magazine