Agripedia

భూసార పరీక్ష అమలు పరచండి ఇలా

S Vinay
S Vinay


అభివ్రిద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగానికి తోడైతే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఒక పంటని పండించడంలో స్థూల మరియు సూక్ష్మ పోషకాల పాత్ర చాల ముఖ్యమైనది, ఈ పోషకాలు నేలలో కొంతశాతం వరకు సహజంగా ఉంటాయి ఇవి ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికే భూసార పరీక్ష చేసుకోవాలి

అసలు భూసార పరీక్ష ఎందుకు చేసుకోవాలి:
మన పొలాల్లో ఉన్న సూక్ష్మ పోషకాలను తెలుసుకోవడం ద్వారా వ్యవసాయ ఖర్చుని తగ్గించుకోవచ్చు నేలలో వున్నా సహజ పోషకాల గురించి రైతుల కి అవగాహనా లేక పోవడం వలన అవసరానికి మరియు మోతాదుకు మించి ఎరువులను వాడుతున్నారు . కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని ఎల్లప్పుడు తెలుసుకోవటం ఎంతో అవసరం. తద్వారా నేల స్థితి దెబ్బ తినకుండా కాపాడుకోవచ్చు మరియు ఖర్చులను అదుపులో పెట్టుకోవచ్చు. పోషకాల గురించే కాకుండా భూసార పరీక్ష ద్వారా నే లలో ఉన్నా కర్బన పదార్ధం,సున్నం మరియు నేల యొక్క కాలుష్యాన్ని గురించి ఖచితమైన సమాచారం తెలుసుకోవచ్చు.

నమూనా ఎంపిక:
ముందుగా పొలంలో ‘V’ ఆకారంలో 15 సెం.మీ. వరకు గుంట తీసి, అందులో పైభాగం నుంచి క్రింద వరకు ఒక ప్రక్కగా మట్టిని సేకరించాలి.ఒక ఎకరా విస్తీర్ణంలో 8-10 చోట్ల సేకరించిన మట్టిని ఒక దగ్గర చేర్చి, బాగా కలిపి 4 భాగాలుగా చేయాలి. అందులో ఎదుటి భాగాలు తీసుకుని, మిగతా భాగాలు తీసివేయాలి. ఈవిధంగా మట్టి 1/2 కిలో వచ్చే వరకు చేయాలి.
ఇలా సేకరించిన మట్టిలో రాళ్లు, పంట వేర్ల మొదళ్ళు లేనట్లుగా చూసుకుని, నీడలో ఆరనివ్వాలి.మట్టి నమూనా సేకరణకు రసాయనిక/సేంద్రియ ఎరువుల సంచులను వాడరాదు.
మట్టి నమూనా కొరకు పొలంలో మట్టిని త్రవ్వి, సేకరించినపుడు గట్ల దగ్గరలోను మరియు పంట కాల్వలలోను మట్టిని తీసుకోరాదు.
చెట్ల క్రిందనున్న పొలం భాగం నుంచి మట్టిని సేకరించరాదు.
ఎరువు (పశువుల పేడ, కంపోస్టు, వర్మి కంపోస్టు, పచ్చిరొట్ట మొదలగునవి) కుప్పలు వేసి ఉంచిన చోట మట్టిని సేకరించరాదు.
ఎప్పుడూ నీరు నిలబడే పల్లపు స్థలంలో మట్టిని సేకరించరాదు.
మట్టి నమూనాని సమీపంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలకు పంపించి ఈ సేవలను పొందవచ్చు

ఈ భూసార పరీక్షలను ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి చేయించాలి తద్వారా వచ్చిన సూచనల మేరకు తగినంత మోతాదులో ఎరువులను వాడుకోవాలి

Related Topics

soiltest

Share your comments

Subscribe Magazine