News

పెరగనున్న వంట నూనెలు...కారణాలు ఇవే!

S Vinay
S Vinay

ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్ ఇండోనేషియాలో ఉత్పత్తి అవుతుంది.ప్రపంచ దేశాలు వంట నూనెను ఇండోనేషియా నుండే దిగుమతి చేసుకుంటున్నాయి,ఇందులో భారతదేశం మినహాయింపు కాదు.

ఏప్రిల్ 28 నుండి ఇండోనేషియా పామాయిల్ ఎగుమతిపై నిషేధాన్ని ప్రకటించిన తర్వాత దేశీయ వంట చమురు ధరలు స్వల్పకాలంలో 10% నుండి 15% వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ అధికారులు తెలిపారు. భారతదేశంలో వంట నూనె ధర ఇప్పటికే భారీగా పెరిగింది ఇపుడు ఇండోనేషియా ఎగుమతులను ఆపివేయడం వల్ల ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగి మధ్యతరగతి వినియోగదారులపై ఆర్థికంగా ప్రభావం చూపుతుంది.గత 12 నెలల్లో, పామాయిల్ ధరలు 50% పెరిగాయి మరియు గత రెండు సంవత్సరాల్లో దాదాపు మూడు రెట్లు పెరిగాయి.

భారతదేశం సంవత్సరానికి దాదాపు 8 మిలియన్ టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది ఇందులో 50% ఇండోనేషియా నుండి మరియు మిగిలినది మలేషియా నుండి దిగుమతి చేసుకుంటుంది.ఇందులో 40 శాతాన్ని వంట నూనె వినియోగానికి కేటాయిస్తుంది. మిగితా వాటాని ప్రాసెస్ చేయబడిన ఆహారం కొరకు, సబ్బులు, షాంపూలు, బిస్కెట్లు వంటి వాటిపై వినియోగిస్తారు.

ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా భారతదేశంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ సరఫరా ఇప్పటికే ఆగిపోయింది.ఇప్పుడు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో అన్ని వంట నూనెలు మరియు ముడి పదార్థాల ఎగుమతులను ఏప్రిల్ 28 నుండి నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.ఇప్పుడు పామాయిల్ సరఫరాకు అంతరాయం కలిగితే ధరలు ఆకాశన్నంటనున్నాయి. అయితే ఈ ఎగుమతుల నిలిపివేత వల్ల భారతదేశం మాత్రమే కాకుండా మిగితా ప్రపంచ దేశాలు కూడా ప్రభావితం కానున్నాయి.

కారణాలు ఏమైనా ఇప్పుడు పెరగనున్న వంట నూనె ధరలు చిన్న,మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

మరిన్ని చదవండి.

తీవ్ర పంట నష్టాన్ని కలుగజేస్తున్న తామర పురుగులని ఇలా నివారిద్దాం.

Share your comments

Subscribe Magazine