ఊరి పై ఏనుగుల దాడి .. ఒకరు మృతి
రైతులు పంటలను చీడపీడలు నుండి కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే అడివికి సమీపంలో వ్యవసాయం చేస్తున్న రైతులకు వన్య ప్రాణులనుంచి నుంచి పంటను కాపాడుకోవడం మరొక్ ఎత్తు , పంటలపై ముఖ్యం గ పందులు ,కోతులు , ఏనుగులు దాడి చేస్తుంటాయి అటువంటి ఘటనలు మన్యం ప్రాంతం లో ఆ మధ్య కాలంలో అధికం అయ్యాయి , కొందరు రైతులు వీటినుంచి పంటకు రక్షణకు వేసిన
కరెంట్ తీగ కు చిక్కుకొని మూగజీవాలు చనిపోతుంటే మరోవైపు వీటి దాడిలో రైతులు చనిపోతున్నారు అటువంటి ఘటన ఒకటి మన్యం లో చోటుచేసుకుంది .
వివరాలలోకి వెళితే ఏనుగులు బీభత్సం సృష్టించడంతో ఒకరు మృతిచెందిన విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లా తాలాడలో చోటుచేసుకుంది. గోపిశెట్టి చిన్నారావు, పార్వతి, జయలక్ష్మీలపై ఏనుగులు దాడి చేశాయి.
ఈ ఘటనలో గాయపడిన చిన్నారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. గతంలో కూడా ఏనుగులు తమ పొలాల్లోకి వచ్చి తమ పంటలను నాశనం చేశాయన్నారు. ఏనుగుల దాడితో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరి పంటను ఆశించే ప్రధాన తెగుళ్లు .. వాటి నివారణ
మరోవైపు అధికారులు మూగజీవాలు సమీపించి నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని , వాటికీ సమీపంగా వెళ్లడం లేదా వాటిపై దాడికి ప్రయత్నించవద్దని అటువంటి సమయం లో ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించాలని సూచిస్తున్నారు .
వరి పంటను ఆశించే ప్రధాన తెగుళ్లు .. వాటి నివారణ
Share your comments