News

"రైతుల అభ్యున్నతే మా ధ్యేయం"- ఆర్య.ఏజి, వ్యవస్థాపకులు ప్రసన్న రావు......

KJ Staff
KJ Staff

ఈ రోజు కృషి జాగరణ్ చౌపాల్లో నిర్వహించిన కార్యక్రమానికి, ఆర్య.ఏజి, వ్యవస్థాపకులు, ప్రసన్న రావు, ఆనంద్ చంద్ర ముఖ్య అతిధులుగా విచ్చేసారు. ఆర్య.ఏజి వ్యవస్థ వ్యవసాయ రంగానికి అందిస్తున్న సేవలను రైతులకు మరింత చేరువ చెయ్యడం ఈ కార్యక్రమం ముఖ్య ఉదేశ్యం. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆర్య.ఏజి వ్యవస్థాపకులు ప్రసన్న రావు, రైతుల అభ్యున్నతే తమ లక్ష్యమని తెలియచేసారు. ఆర్య.ఏజి కంపెనీ స్థాపించిన నాటి నుండి నేటివరకు, వ్యసాయంలో తీస్కువచ్చిన మార్పుల గురించి తెలియచేసారు.

భారత దేశంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వస్తుందన్న నమ్మకం చాల తక్కువ, దీనికి ప్రధాన కారణం, రైతుల వద్ద నిల్వ సామర్ధ్యం లేకపోవడం. ఈ సమస్యనే పరిష్కరించాడనికి ఆర్య.ఏజి గత కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తుంది. ఆర్య.ఏజి సంస్థ వేర్హౌస్ సదుపాయాన్ని రైతులకు అందిస్తుంది, తద్వారా రైతులు తమ పండించిన పంటను ఎక్కువ కాలం నిల్వ చేసుకుని, మార్కెట్లో డిమాండ్ పెరిగిన తర్వాత విక్రయించి మంచి లాభాలు పొందవచ్చు, అంతేకాకూండా ఈ సంస్థ పంట దిగుబడికి తగ్గ లోన్లను, ఇన్సూరెన్సు కల్పిస్తుంది. ఆర్య.ఏజి వ్యవస్థాపకులు ప్రసన్న రావు బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ రంగంలో ఎంతో అనుభవం కలిగివున్నారు, అలాగే ఆనంద్ చంద్ర వ్యవసాయ మరియు వ్యవసాయ వ్యాపారంపై ఉన్న జ్ణానం మూలంగా, ఆర్య.ఏజి సంస్థ ఎంతో దిగ్విజయంగా, రైతులకు సేవలను అందిస్తుంది.

కార్యక్రమం ప్రారంభం:

కృషి జాగారం వ్యవస్థాపకులు, మరియు ముఖ్య సంపాదకులు అయిన ఎం.సి. డొమినిక్ మరియు ఆయన సహధర్మచారిణి, కృషి జాగరణ్ మేనేజింగ్ డైరెక్టర్ షైనీ డొమినిక్, అతిధులకు, మొక్కలు బహూకరించి ఈ కార్యక్రమం ప్రారంభించారు. మొదట ఎం.సి. డొమినిక్, అతిధులను ఉదేశిస్తూ ప్రసంగించారు. రైతులు పండించే పంట అమ్మకానికి భోరోసా కల్పించిన ఆర్య.ఏజి ఆలోచనను అభినందించారు. ఈ ఆలోచన వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తీసుకువస్తుందని అయన ప్రస్తావించారు. రైతుల ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచడంలో ఆర్య.ఏజి సంస్థ తన వంతు సాయం చేస్తుందని సంతోషం వ్యక్తం చేసారు. అనంతరం కృషి జాగరణ్ ప్రతిష్ఠాత్మకంగా మొదలుపెట్టిన MFOI అవార్డుల గురించి, ఈ అవార్డుల వెనుక ఉన్న ముఖ్య ఉదేశం గురించి ఒక చిన్నపాటి వీడియో ద్వారా తెలియపరిచారు.

ఆర్య.ఏజి వ్యవస్థాపకులు:

అనంతరం ఆర్య.ఏజి సహా వ్యవస్థాపకులు ప్రసన్న రావు మాట్లాడుతూ, రైతులకు వాణిజ్య పరంగా, నిల్వ సామర్ధ్యం పరంగా ఉన్న అవరోధాలను తొలగించి పంట విక్రయాన్ని సులభతరం చేసేందుకు పనిచేస్తున్నట్లు తెలిపారు గ్రామీణ అభివృద్ధిపై, వ్యవసాయ ఉత్పత్తుల నిర్వహణ మరియు బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసిన అనుభవం ఉన్నందున అయన నైపుణ్యం ఇందుకు తోడ్పడుతుందని అయన తెలిపారు. అంతేకాకుండా ఈ కంపెనీ సహా వ్యవస్థాపకులైన ఆనంద్ చంద్ర మరియు ప్రసన్న రావు ఒకే బ్యాంకులో ఆర్ధిక విభాగంలో పనిచెయ్యడం మరొక్క విశేషం. బ్యాంకింగ్ రంగంలో పని చేసే సమయంలో, బ్యాంకులు లోన్లు అధికంగా ట్రేడర్లకు, పెద్ద రైతులకు మాత్రమే ఇవ్వడం కాస్త అసంతృప్తిని కలిగించేదని అయన తెలిపారు, ఎందుకంటే చిన్న మరియు మధ్య తరహా రైతులు అధికంగా ఉన్న దేశం కనుక వారిని ఆర్ధికంగా బలపరచడం ముఖ్యమని అయన ప్రస్తావించారు.

రైతులు సమస్యల గురించి అయన మాట్లాడుతూ, మన దేశంలో రైతులు తమ పంటను ఎప్పుడు మరియు ఎక్కడ విక్రయించాలో అనే విషయంపై అవగాహనా లేక అధిక లాభాలు ఆర్జించలేకున్నారని తెలిపారు. చాల మంది రైతులు తాము పండించిన పంట నిల్వ చేసే సామర్ధ్యం లేక తక్కువ ధరకే తమ పంటను అమ్మే పరిస్థితి వస్తుంది. ప్రసన్న రావు తమ ఆర్య.ఏజి సంస్థ ద్వారా రైతులు పంటలు ఎక్కువ కాలం నిల్వ చేసుకోగలిగేలా, వెర్హౌస్ సదుపాయాన్ని కలిగిస్తుంది, మరియు రుణాలు అవసరం ఉన్న రైతులకు నిల్వ చేసిన తమ పంట అప్పటి మార్కెట్ రేటు బట్టి, 80% వరకు రుణాలను అందిస్తున్నారు.

ఫుడ్ టెక్ కంపెనీలు, తమ వ్యాపార అవసరాలకోసం, నేరుగా ఆర్య.ఏజి వెబ్సైటు ద్వారా పంటా కొనుగోలు చేస్తారు. పంట నాణ్యత, మొత్తం ఎంత ధాన్యం నిల్వలు ఉన్నాయి అనే వివరాలను వెబ్సైట్ ద్వారా తెల్సుకోవచ్చని తెలిపారు. రైతులు కూడా నేరుగా కంపెనీలకు విక్రయించడం ద్వారా తాము పండించిన పంటకు అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. చివరిగా గత 10 సంవత్సరాలుగా ఆర్య.ఏజి సాధించిన విజయాలను ప్రస్తావించారు.

చివరిగా, కృషి జాగరణ్ గ్రూప్ ఎడిటర్, మరియు సిఎంఓ మమతా జైన్, తమ ఆహ్వానాన్ని మానించి కృషి జాగరణ్ ఆఫీస్ కి విచ్చేసిన ఆర్య.ఏజి వ్యవస్థాపకులకు ఇద్దరికీ ధన్యవాదాలు తెలియజేసారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రసన్న రావు, ఆనంద్ చంద్ర అందిస్తున్న, సేవలకు మరియు వారి ఆలోచనలకు ఆనందం వ్యక్తం చేసారు.

Share your comments

Subscribe Magazine

More on News

More