News

శుభ్రమైన ఆహారమే లక్ష్యంగా అక్షయపాత్ర

KJ Staff
KJ Staff

భారత దేశంలోని లక్షలాది పిల్లకు ప్రతీ రోజు శుభ్రమైన మరియు ఆరోగ్య కరమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా అక్షయపాత్ర ఫౌండేషన్ పనిచేస్తుంది. ఎంతో మంది ఆకలి తీరుస్తున్న ఈ సంస్థ మరొక్క మైలు రాయిని చేరుకుంది. ఈ ఫౌండేషన్ ద్వారా 400 వందల కోట్ల మందికి భోజనాన్ని వడ్డించింది. అక్షయపాత్ర సాధించిన ఈ ఘనతను దృష్టిలో పెట్టుకొని, మంగళవారం ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో, ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి, ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు, ఆర్. నారాయణ మూర్తి, అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు, మధు పండిత్ దాస, మరియు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి హాజరయ్యారు.

ప్రతీ రోజు కోట్లాది మంది బాలలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడం ద్వారా, అక్షయపాత్ర భావితరాలకు పోషణ అందిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. అంతే కాకుండా బృందావన్ వద్ద కోట్లాది మందికి భోజనం వడ్డించడం, ఎంతో గర్వకారణమని ప్రధాని ప్రసంశించారు. ఆహార భద్రత, సుస్థిరాభివృధి సాధనలో భరత్ సాధించిన విజయాలు అనే అంశంలో, ఐక్యరాజ్య సమితిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 400 వ కోట్ల భోజనాన్ని సమితి ప్రధాన కార్యాలయంలో వడ్డించిన అక్షయపాత్ర ఫౌండేషన్ కృషిని అభినందిస్తూ ప్రధాని మోడీ పంపిన సందేశాన్ని భారత శాశ్వత కార్యాలయ ప్రతినిధి రుచిరా కంబోజ్ సమితిలో చదివి వినిపించారు. సుస్థిరాభివృధి ప్రధాన లక్ష్యాల్లో భాగమైన, ఆకలి నిర్ములన ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు.

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి మాట్లాడుతూ, ఇన్ని కోట్ల మందికి అన్నం వడ్డించడం సాధారణ విషయంకాదని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలను కాపాడుకోవడానికి, 2030 నాటికల్లా సుస్థిరాభివృధి లక్ష్యాలను సాధించి తీరాలని ఆయన మాట్లాడారు. ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి మాట్లాడుతూ, పేద పిల్లల ఆకలి తీర్చడానికి, అక్షయ పాత్ర వంటి కార్యక్రమాలు వారి దేశాల్లో కూడా నిర్వహించాలని సమితి సభ్యులను కోరారు.

అక్షయ పాత్ర ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలు కలసికట్టుగా నిర్వహిస్తున్న ఒక కార్యాక్రమం. శుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని, వేగంగా, వేడిగా అందించడానికి, అక్షయపాత్ర ఫౌండేషన్ అధునాతన సంకేతను, నూతన విధానాలను వినియోగిస్తుంది. తాము ఉపయోగిస్తున్న పరిజ్ఞానం ఇతర దేశాల్లోని ప్రజలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అక్షయ పాత్ర చైర్మన్ మధుపండిత్ దాస తెలిపారు.ప్రస్తుతం అక్షయ పాత్ర భారత దేశంలో 72 వంటశాలలను నిర్వహిస్తుంది. గత 24 ఏళ్లుగా 24,000 పాఠశాలల్లోప్రతిరోజు విద్యార్థులకు భోజనం అందిస్తున్నట్లు దాస తెలిపారు.

Share your comments

Subscribe Magazine