ఏపీ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఆగ్రోస్ ) వైస్ . చైర్మన్ ఎండి ఎస్. కృష్ణ మూర్తి ఏపీ రాష్ట్రంలో కొత్తగా 680 ఆగ్రో రైతు సేవ కేంద్రాలను ఏర్పాటు చేస్తునట్టు చెప్పారు. స్థానిక విజయవాడ రోడ్డులో అగ్రి కింగ్ ట్రాక్టర్ కంపెనీ జిల్లా అధీకృత డీలర్ షోరూంను మంగళవారం ఆయన ప్రారంభించారు.
ప్రతి మండల కేంద్రంలో ఆగ్రో రైతు సేవ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతులకు వ్యవసాయ యంత్రాలను మరియు పరికరాలను అందుబాటులో ఉంచాలని ఆయన విలేకరిగా మాట్లాడుతూ అన్నారు. వీటి ద్వారా ఔత్సహిక గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకున్ స్వయం ఉపాధి కల్పించనున్నట్లు తెలియజేసారు. ప్రభుత్వం ఈ కేంద్రాల నిర్వహణకు అవసరమైన శిక్షణ ఇవ్వడంతో పాటు బ్యాంకు రుణాలు కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ ఆగ్రో రైతు సేవ కేంద్రాల్లో రైతులకు అవసరమైన యంత్రాలు అనగా దుక్కి యంత్రాలు, దమ్ము చదును చేసే యంత్రాలు, వారి నాటు వేసే యంత్రాలు, పంట నూర్పిడి యంత్రాలు, కలుపు తీసే పరికరాలు, స్ప్రేయర్లు, రోటవేటర్లు వంటి యంత్రాలు లభిస్తాయి.
ఈ ఆగ్రో రైతు కేంద్రాలలో రైతులకు తక్కువ ధరలోనే నాణ్యమైన వ్యవసాయ యాంత్రీకరణ ఉత్పత్తులు, ఎరువులు, పురుగు మందులను అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు. వ్యవసాయ యంత్రాలకు సంబంధించిన సేల్స్, స్పేర్స్, సర్వీసులు సదుపాయాలు అన్ని ఒకే చోట రైతులకు అందుబాటులో ఉంచటం ద్వారా యాంత్రీకరణ మరింత పెరిగే అవకాశం ఉంది అని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి .
పురుగుల మందుల పిచికారీ సమయం లో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు..
ఇప్పటికే ప్రతి గ్రామాములోను రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు రైతులకు అందిస్తున్నామని చెప్పారు. గత ఏడాది 4 వేల ట్రాక్టర్లు , చొంబినె హార్వెస్టర్లు రైతులకు సబ్సిడీపై అందజేసినట్లు వివాటించారు.
అగ్రి కింగ్ డైరెక్టర్ (సేల్స్ ) రాజీవకుమార్ శర్మ, సౌత్ ఇండియా హెడ్ ఫసర్ భాష, జిల్లా డీలర్ సింగవరపు సత్య భాస్కర్ గణేష్, ఏరియా మేనేజర్ సిహెచ్ రవికుమార్ , స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమనేని సత్యప్రసాద్, జెడ్పిటిసి మాజీ సభ్యుడు వేగిరెడ్డి పాపారావు , మాజీ సర్పంచ్ తవ్వా హేమేశ్వర నరసింహమూర్తి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు చిన్నబోయిన శివయ్య , రైతు నాయకుడు తాడి నాగేశ్వర రావు ,హెచ్ డి ప్ సి బ్రాంచ్ మేనేజర్ వి సత్య ప్రసాద్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి .
Share your comments