సహజ వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతును జాతీయ సంపదగా పరిగణిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆజాదీ కి అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నీతి ఆయోగ్ నిర్వహించిన “సహజ వ్యవసాయం”(natural farming) కార్యక్రమం లో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ ముక్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ సహజ వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతును జాతీయ సంపదగా భావించి తగిన ప్రతిఫలం అందించాలని అన్నారు.సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సహజ వ్యవసాయానికి అయ్యే ఖర్చులో 90% భరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను’’ అని వర్చువల్ సమావేశంలో జగన్ అన్నారు.
హరిత విప్లవాన్ని ప్రస్తావిస్తూ వినూత్న పద్ధతుల వల్ల వ్యవసాయ ఉత్పాదకత అనేక రెట్లు పెరిగిందని అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులపై ఆధారపడటాన్ని తగ్గించి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైంది.
రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల ఆహార భద్రత కూడా దెబ్బతింటుంది కాబట్టి నేల ఉత్పాదకతను పెంచడానికి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి అని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహజ వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ 'సతత హరిత విప్లవం'పై దృష్టి పెట్టింది. 6.30 లక్షల మంది రైతులు, 10,778 రైతు భరోసా కేంద్రాల ద్వారా 2.9 లక్షల హెక్టార్లలో సహజ వ్యవసాయం చేస్తున్నారు. రాష్ట్రంలో 5 శాతం విస్తీర్ణంలో సహజ వ్యవసాయం జరుగుతోంది. మేము సహజ వ్యవసాయానికి కట్టుబడి ఉన్నాము మరియు సహజ వ్యవసాయాన్ని ఎంచుకునే రైతులను ఆదుకోవడానికి మేము కట్టుబడి ఉన్నాము అని ముఖ్యమంత్రి చెప్పారు.
అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో రైతుల సంక్షేమమే ప్రధానాంశమని, 2 వేల మంది రైతులకు అండగా ఉండేలా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు వారి ఇంటి వద్దకే సేవలు అందిస్తున్నామని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
మరిన్ని చదవండి.
Share your comments