APEDA ద్వారా వ్యవసాయ మరియు ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 23. 7 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని అధిగమించగలవని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
ఇప్పటి వరకు 417 రిజిస్టర్డ్ GI ఉత్పత్తులు ఉన్నాయని, అందులో 150 వ్యవసాయ మరియు ఆహార రంగానికి చెందినవని కూడా ఉన్నాయని తెలిపింది.
భారతదేశం నుండి ఎగుమతుల ప్రోత్సాహం మరియు అభివృద్ధిలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ఐటి ఆధారిత కార్యకలాపాలను ప్రోత్సహించడం వంటి వరుస చర్యలను తీసుకోవడం ద్వారా అధిక మొత్తం లో వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహహించవచ్చని, త ద్వారా వ్యవసాయ ఎగుమతులు పెరుగుతాయని దాని కోసం వ్యవసాయ మరియు ప్రాసెస్ డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్ పోర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ (ఎపిఇడిఎ) చర్యలు తీసుకుంటోందని తెలిపింది. వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించడానికి రయితులకు మార్కెట్ లింకేజీ లను ఏర్పరుపరుస్తామని వాణిజ్య శాఖ తెలిపింది. ఇది ఎగుమతులను పెంచడానికి సహాయపడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఉద్భవిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఆయా దేశాల భారత రాయబార కార్యాలయాలు మరియు హై కమిషన్లతో సంప్రదించి 60 దేశాలకు దేశ నిర్దిష్ట వ్యవసాయ ఎగుమతి వ్యూహ నివేదికలు తయారు చేయబడ్డాయని తెలిపింది.
APEDA కింద వ్యవసాయ మరియు ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులు 2010-11 లో 9.31 బిలియన్ డాలర్ల (రూ.42,437 కోట్లు) నుండి 2020-21 లో 20.67 బిలియన్ డాలర్లకు (రూ.1,53,049 కోట్లు) పెరిగాయి అని అయన అభివర్ణించారు .
"సరుకుల ప్రపంచ వాణిజ్యంలో అనేక రవాణా సవాళ్లు ఎదురైనప్పటికీ, గత దశాబ్దంలో భారతదేశ వ్యవసాయ మరియు ప్రాసెస్ చేయబడిన ఆహార ఎగుమతులు స్థిరమైన వేగంతో పెరిగాయి అని ఎపిఇడిఎ ఛైర్మన్ ఎం అంగముతు అథారిటీ యొక్క 36వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తెలిపారు.
ఇంకా చదవండి .
Share your comments