News

Latest update on farm law!రద్దు చేసిన 3 వ్యవసాయ చట్టాలను తిరిగి ప్రవేశ పెట్టబోమన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

Srikanth B
Srikanth B
Minister of Agriculture & Farmers Welfare.
Minister of Agriculture & Farmers Welfare.

 రాజ్యసభ లో రద్దు చేయబడిన 3 వ్యవసాయ చట్టాలను తిరిగి ప్రవేశపెట్టే ఆలోచన ప్రభుత్వానికి ఉందా అని అడిగినప్పుడు,కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దానికి లిఖిత పూర్వ సమాధానం గ రద్దు చేసిన 3 వ్యవసాయ చట్టాలను తిరిగి ప్రవేశపెట్టే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని , ఇక భవిష్యత్తులో కూడా ఈ ఏ చట్టాల ప్రస్తావన రాదని  ఆయన వెల్లడించారు. అదే విధంగ ఉద్యమంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారానికి సంబందించిన విషయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నాయని అయన తెలిపారు.

గత ఏడాది నవంబర్ 19న ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలలో చేసిన ప్రసంగంలో మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తునట్లు  ప్రకటించారు, వ్యవసాయ రంగ సంస్కరణల కోసం తెచిన్నా ఈ చట్టాలు ప్రజలను అర్ధం కాకపోవడం వాళ్ళ ఆశయానం వ్యర్థం చేస్తున్నారని , నిజానికి  ఈ చట్టలు రైతు లకు ఎంతో మేలుచేసే ఉద్దేశం తో సంస్కరణలు తెచ్చామని అయన వెల్లడించారు .

రద్దు చేయబడిన మూడు చట్టాలు:

వ్యవసాయ ఉత్పత్తి వాణిజ్యం మరియు వాణిజ్యం (ప్రోత్సాహం మరియు సౌకర్యం) చట్టం;

వ్యవసాయ (సాధికారత మరియు రక్షణ) ధరల హామీ మరియు వ్యవసాయ సేవల చట్టం యొక్క ఒప్పందం;

 నిత్యావసర వస్తువుల (సవరణ) చట్టం.

PM -కిసాన్ పథకంపై ప్రత్యేక ప్రశ్నకు సమాధానంగా వ్యవసాయ శాఖ మంత్రి   "ఫిబ్రవరి 8, 2022 నాటికి, 11.78 కోట్లకు పైగా లబ్ధిదారులకు ఈ పథకం కింద సుమారు రూ.1.82 లక్షల కోట్ల ఆర్థిక ప్రయోజనాలు వివిధ విడతల ద్వారా లబ్ధ్ది పొందారని అయన వెల్లడించారు,  48.04 లక్షల మంది అనర్హులుగా గుర్తించారు. అందువల్ల, సమర్థవంతంగా, ఈ పథకం కింద సుమారు 11.30 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులు ఉన్నారు" అని ఆయన తెలిపారు. 2019-20 వ్యవసాయ రంగం GDP (1.2) శాతం గా ఉందని, ఎగుమతుల విలువ రూ. 2,52,297 కోట్ల లో ఉందని ఆయ న ప్ర స్తావించారు.

కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ, వ్యవసాయ ఎగుమతుల్లో 22.8 శాతం వృద్ధి రూ.3,09,939 కోట్లుగా ఉంది, 2020-21 లో జిడిపికి 1.6 శాతంవృద్ధి సాధించిందని తెలిపారు . PM - KISAN ఈ పథకం ద్వారా  అర్హత కలిగిన  రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక ప్రయోజనం అందించబడుతుంది, ఇది ఒక్కొక్కటి రూ. 2,000 చొప్పున మూడు సమాన 4 నెలలవిడతల వారిగా  నేరుగా రైతు బ్యాంకు ఖాతాలలో జమ చేస్త్తున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడించారు .

Share your comments

Subscribe Magazine