News

ఓ వైపు ఉద్యోగం.. మరోవైపు వ్యవసాయం..

KJ Staff
KJ Staff

ప్రస్తుత కాలంలో ఉద్యోగస్తులకు తీరిక సమయం కూడా దొరకదు. అలాంటిది చెన్నై లో ఉద్యోగం చేసే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన చిత్తూరు జిల్లాలో తన సొంత గ్రామానికి వారాంతంలో వచ్చి వ్యవసాయ పనులు చేస్తున్నాడు. ప్రతిరోజు పండించే రైతులకు, వారంలో రెండు రోజులు పండించే ఈ ఉద్యోగి ఎంతో లాభాన్ని అందుకుంటున్నాడు. అది ఎలానో చూద్దాం..

గోవర్ధనగిరికి చెందిన రవీంద్ర అనే వ్యక్తి ఒరాకిల్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ఈయనకు 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇక సుమారు ఓ ఎనిమిదేళ్ల పాటు చెరుకు పంట పండించగా లాభం అందలేదు. ఇక ఓ వ్యవసాయ శాస్త్రవేత్త దగ్గర సలహాలు తీసుకున్నాడు. అప్పటి వరకు ఆయన రసాయన ఎరువులు, పురుగుల మందులను వాడటం వల్ల సారాన్ని కోల్పోయాడు. 1.5 గుంటల నేలను ప్రకృతి వ్యవసాయానికి ఎంచుకొని అందులో కానగ ఆకు, వేపాకు, జిల్లేడు ఆకు వేసి వాటిని మగ్గ పెట్టి 5 కిలోల భారీ విత్తనాలు చల్లారు. ఇక పెరిగిన నారును 1.5 గుంటల భూమిలో అలనాటి దేశీ వరి వంగడం కృష్ణ పంట సాగును ప్రారంభించారు.

దేశి ఆవు పేడ, మూత్రం, ఆకులు, పాలు, మజ్జిగ, బెల్లం, పుట్ట మట్టి వంటి వివిధ రకాల ధాన్యాల పిండితో పంట కు ఉపయోగపడే ఘన జీవామృతం, బీజామృతం తయారు చేశారు. వేప ద్రావణం, పులియబెట్టిన మజ్జిగ, అగ్నస్త్రము, సప్త ధాన్యంకుర కషాయాలను సిద్ధం చేసుకొని అవసరమైనప్పుడల్లా పైరు కి వాడటం వల్ల ఎటువంటి తెగుళ్ళ సమస్యలు దరి చేరలేవు. మరో ఎనిమిది ఎకరాల్లో క్రిష్ణ వంగడం సాగు చేయడంతో అనుకున్న దానికంటే ఏపుగా, చక్కగా పెరిగింది. దానికి రసాయనిక ఎరువులు, పురుగుమందులతో సాధారణ పద్ధతి కంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం వల్ల 50 శాతం నుండి 60 శాతం తక్కువ ఖర్చు అయ్యిందని తెలిపాడు రవీంద్ర.

Share your comments

Subscribe Magazine