సాదారణముగా మనం వర్షం నుంచి రక్షించు కోవడానికి రైన్ కోర్ట్ లను ధరిస్తాము , అయితే మాటరాని ముగ జీవాల గురించి ఆలోచించిన ఒక రైతు మేతకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న మేకలకు తన వినుతన ఆలోచన తో వర్షం లో తడవకుండా మందు సంచులతో వాటికీ రెయిన్ కోట్ ను తొడిగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ గ మారింది .
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియడంతో మేకలు పగటిపూట సంచరిస్తూ మేతకు ఇబ్బంది పడవద్దని రైతులు ఈ వినూత్న ఆలోచన చేసాడు . తమిళనాడులోని తంజావూరులోని కులమంగళ గ్రామానికి చెందిన గణేశన్ ఈ రెయిన్‌కోట్‌ను తయారు చేశాడు.
గణేశన్‌కు జంతువులంటే చాలా ఇష్టం, ఈ నేపథ్యంలో తన పొలంలో గొర్రెలు, ఆవులు, కోళ్లను కూడా పెంచుతున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా అతని మేకలు ఇబ్బంది పడుతున్నాయి. మరియు మేకలు మేపుతుండగా విపరీతమైన చలికి వణుకుతున్నట్లు గమనించాడు.
ఆక్వా యూనివర్సిటీ, ఫిషింగ్ హార్బర్‌కు శంకుస్థాపన చేయనున్న CM జగన్
అందుకే తన మేకలు వర్షంలో తడవకుండా తాత్కాలిక బియ్యం బస్తాలతో రెయిన్‌కోట్‌లు తయారు చేశాడు. జంతువులపై ఆయనకున్న ప్రేమను నెటిజన్లు అభినందిస్తూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు.
మరోపక్క గొర్రె వెంట్రుకలతో శాలువాలు తయారీ ..ఎక్కడో తెలుసా !
కాశ్మీర్ అనేక వైవిధ్యాలకు కేంద్రం , భూగోళికంగా , వాతావరణము , భిన్న సాంసృతిక తో కూడుకున్న కాశ్మీర్ యొక్క ప్రత్యేకతలు ఎన్నో వాటిలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన "పష్మినా శాలువాలు "ఒకటి వీటిగురించి మనం ఈరోజు తెలుసుకుందాం .
పష్మినా శాలువాలు తయారీ కోసం వాడే ఉన్ని ని లడఖ్‌లోని ఎత్తైన పీఠభూమికి చెందిన చాంగ్తాంగి మేక (కాప్రా ఏగాగ్రస్ హిర్కస్) నుండి ఉన్నిని సేకరిస్తారు . ఎంతో నాణ్యతో కూడిన ఈ పష్మినా శాలువాలు భారతదేశంలోని సంస్కృతికి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకతను కలిగివున్నాయి . 2019లో, బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (BIS) దాని స్వచ్ఛత గుర్తిస్తూ దానికి BIS మార్కును ఇచ్చింది .
Share your comments