మన భారతదేశంలో పసుపుకు చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. పూజా కార్యక్రమాల నుండి వంటల వరకు అన్నిటిలో ఈ పసుపును వాడుతాం. అలాంటి పసుపును రైతులు మాత్రం కష్టాలు పడుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పసుపు రైతులు నష్ఠాల పాలవుతున్నారు. ఎంతో కష్టపడి పండించిన పంటకు ఇలా కావడంతో రైతులు దిగులు చెందుతున్నారు.
కృష్ణా జిల్లాలో ఎక్కువ శాతం పసుపు పంటను లంక, మెట్ట భూముల్లోని రైతులు సాగుచేస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఎకరాకు 30 నుండి 35 క్వింటాళ్ల వరకు పసుపు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. కానీ ఈ సంవత్సరం చీడ పురుగుల కారణంగా మరియు వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంట దిగుబడి తగ్గిపోయిందన్నారు, ఈ సంవత్సరం ఇక్కడ ఎకరా భూమికి కేవలం 25 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని రైతులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరకు అమ్మితే నష్టాల పాలు కావల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏటా ధరల పతనం, పెట్టుబడి ఖర్చులు పెరగడం, చీడ పీడల ప్రభావంతో పసుపు సాగు చెయ్యాలంటేనే భారంగా మారిందని వాపోతున్నారు. ప్రభుత్వం కనీసం మద్దతు ధరనైనా కల్పించి తమని ఆదుకోవాలని ఉమ్మడి కృష్ణా జిల్లా కర్షకులు వేడుకుంటున్నారు.
ఇది కూడా చదవండి..
అల్లం సాగు చేస్తే లక్షలు సంపాదించొచ్చు.. ఇప్పుడే వివరాలు తెలుసుకోండి..
పసుపు పంట యొక్క నిర్వహణ ఖర్చులు కూడా ఈ సంవత్సరం పెరిగిపోయాయి. చీడ పురుగుల బెడద ఎక్కువగా ఉండడంతో అధిక మోతాదులో ఈ మందులను పిచికారీ చేయవలసి వస్తుంది. వీటితోపాటు ఈ సంవత్సరం పంటకు సంబంధించి విత్తనాలు, ఎరువులు, మరియు పురుగుమందుల ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. ఇందువలన ఈ పసుపు పంటను సాగు చేయడానికి రైతులకి ఒక ఎకరా పొలానికి 70 వేల నుండి 80 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
ప్రస్తుతం మార్కెట్లో క్వింటా పసుకుకు 4 వేల నుండి 4500 రూపాయల వరకు ధర పలుకుతుంది. ఈ ధరతో రైతులకు కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో, నష్టాలు వస్తున్నాయి అని రైతులు బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితియిలో కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని రైతులు చెబుతున్నారు. పసుపు పంటకు 6 నుంచి 7 వేల ధర ఇస్తే రైతుకు గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. పసుపు కొనుగోలుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments