News

"సమర్థవంతులైన రైతుల ద్వారా మాత్రమే నవ భారత నిర్మాణం సాధ్యపడుతుంది" - ప్ర ధానమంత్రి

Srikanth B
Srikanth B

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 : రైతులు ఎంత బలంగా ఉంటే, నవ భారతదేశం మరింత సంవృద్ధిగా ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అన్నారు మరియు 'పిఎం కిసాన్ సమ్మాన్ నిధి' మరియు ఇతర వ్యవసాయ సంబంధిత పథకాలు కోట్లాది మంది చిన్న సన్న కారు రైతులకు కొత్త బలాన్ని ఇస్తున్నాయని ఉద్ఘాటించారు.

11.3 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.1.82 లక్షల కోట్లు నేరుగా బదిలీ అయ్యాయని ప్రధాని ట్విటర్లో పేర్కొన్నారు.

'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' మరియు ఇతర వ్యవసాయ సంబంధిత పథకాల కింద రైతులు పొందిన ప్రయోజనాలను ప్రధాని వివరించారు.

'మన రైతు సోదర సోదరీమణులను చూసి దేశం గర్విస్తోంది. వారు ఎంత బలంగా ఉంటే, నవ భారతదేశం అంత సంవృద్ధిగా ఉంటుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, వ్యవసాయానికి సంబంధించిన ఇతర పథకాలు దేశంలోని కోట్లాది మంది రైతులకు కొత్త బలాన్ని ఇస్తున్నాయని నేను సంతోషిస్తున్నాను' అని మోదీ ట్వీట్ చేశారు.

TS EAMCET BIG Update : ఇంటర్మీడియట్ మార్కుల’వెయిటేజీ’ రద్దు!

Share your comments

Subscribe Magazine