గత నెల వరకు వ్యవసాయ మార్కెట్లలో క్వింటాల్ రూ.2వేల వరకు పలికిన ఉల్లి ధర ఒక్కసారిగా పడిపోవడంతో ఉల్లి రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు , గడిచిన నెల రోజ లుగా వ్యవసాయ మార్కెట్లలో ఉల్లి ధర క్వింటాల్ రూ.500 నుంచి రూ.800 వరకు మాత్రమే పలుకుతుండడంతో ఉల్లి రైతులు పెట్టిన పెట్టుబడి రాక రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నారు .
ప్రస్తుతం మార్కెట్‌లో ఉల్లిపాయల ధర ధర రోజు రోజుకూ పడిపోతోంది. జనవరి మొదటి వారంలో క్వింటా ఉల్లిపాయల ధర రూ.2వేల నుంచి రూ.2100 దాకా పలికింది. అయితే మూడు వారాలుగా మార్కెట్‌లో క్వింటాల్ ఉల్లి ధర రూ.800 నుంచి రూ.500క పడిపోయి ఆ పంట సాగు చేసిన రైతులకు కన్నీళ్లు పెట్టిస్తోంది.
అధిక వర్షాలకు, చీడపీడలు ఆశించి ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గిందని ఆందోళన చెందుతున్న రైతులకు కనీసం పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందని ఆశగా వెళుతున్న ఆరైతుకు మార్కెట్ ధరలతో ఏమి చేయాలో అర్ధం కాకా దిక్కు తోచని స్థితిలో ఉన్నారు రైతులు . వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఎకరాకు దాదాపు 45 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ఈ ఏడాది ఎకరాకు 20 క్వింటాళ్ల లోపే దిగుబడి వచ్చింది.
బహిరంగ మార్కెట్‌లో కిలో 20 పలుకుతున్న దళారులు కారణంగా మార్కెట్‌లో క్వింటా ఉల్లి ధర రూ.500 నుంచి రూ.800 మేరకే పలుకుతోందని రైతు బజార్లో మాత్రం కిలో ఉల్లి రూ.20 నుంచి రూ.25 దాకా అమ్ముతున్న పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చిన అరొకర దిగుబడిని మార్కెట్‌కు తీసుకొస్తే కిలోకు రూ.5 కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
విదేశాల్లో ఖమ్మం మిర్చికి బారి డిమాండ్
ఉల్లిగడ్డను నిల్వ చేసే గిడ్డంగులు, ఇతర సదుపాయాలు రైతులకు అందుబాటులో లేకపోవడంతో పండిన పంటను కొద్ది రోజుల్లోనే అమ్మాల్సిన దుస్థితి దీనిని అదునుగా భావించిన వ్యాపారాలు సిండికేట్‌గా మరి రైతులను దోచుకుంటున్నారు .
Share your comments