Agripedia

విదేశాల్లో ఖమ్మం మిర్చికి బారి డిమాండ్

Gokavarapu siva
Gokavarapu siva

మిరప పంటను భారతదేశంతో పాటు అనేక అంతర్జాతీయంగా దేశాలలో ప్రధాన పంటగా పండిస్తారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలలో మిర్చి సాగు జరుగుతుంది. ఈ మిరపలో విటమిన్ సి మరియు బి, కాల్షియమ్, మెగ్నీషియం, ఐరన్ అనేవి అధికంగా ఉంటాయి. అల్లాంటి ఈ మిర్చికి, ముఖ్యంగా ఖమ్మంలో పండించే మిరపకు అంతర్జాతీయంగా డిమాండ్ బాగా ఉంది. ఖమ్మంలో పండించే మిరపలో దాదాపుగా 70 శాతం మిర్చి అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి చేస్తుంది. ముఖ్యంగా శ్రీలంక, చైనా, బాంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంది.

మిర్చి పంటను వేయాలంటేనే భయపడేవిదంగా తెగుళ్ళ సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి. దీనిని అరికట్టేంద్దుకు ఇక్కడ రైతులు, ఈ తెగుళ్లను తట్టుకొనే రకాలైన 'తేజ' వంటి రకాలను సాగు చేస్తున్నారు. ఈ రకాలను సాగు చేయడం వలన దిగుబడి కూడా పెరుగుతుంది మరియు ఈ తెగుళ్ల సమస్య కూడా తగ్గుతుంది. దాదాపుగా ఖమ్మం మార్కెట్ నుంచి 2 వేల కోట్ల రూపాయలకు పైగా మిర్చి అనేది ఎగుమతి అవుతుంది.

విదేశాల నుంచి ఇక్కాడ వ్యాపారులు ఆర్దార్లు తీసుకుని మిర్చిని కొనుగోలు చేస్తున్నారు. ఆలా కొనుగోలు చేసిన ఈ మిర్చిని భారతదేశంలో ఉన్న వివిధ పోర్టులయిన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, కృష్ణపట్నం, తమిళనాడులోని కాట్పల్లి ద్వారా విదేశాలకు నౌకలలో ఎగుమతి చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..

మిర్చి రికార్డు ధర క్వింటా 80 వేలు ...

ఈ మిరపను వివిధ దేశాలలో వివిధ రకాలుగా వాడతారు. చైనా వంటి దేశాలలో మిర్చిని కాయల రూపంలో వాడతారు. అలాగే యూరోప్, అమెరికా వంటి దేశాలలో ఐతే మిర్చి నుండి ఆయిల్ తీసి, ఆ నూనెను ఉపయోగిస్తారు. దీనికోసమని తెలంగాణలో ఈ మిర్చి నుండి ఆయిల్ తీసే కంపెనీలు కూడా ఏర్పాటు చేసారు. ఈ కంపెనీలు ఖమ్మం జిల్లా ముదిగొండ, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మన్నెగూడం, మరిపెడ బంగ్లా, హైదరాబాద్లోని శ్రీశైలం రోడ్డులో ఉన్న కందుకూరు ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక వంద కేజీల మిర్చిని ప్రాసెసింగ్ చేస్తే కనుక 8 కేజీల పొడి, కేజిన్నర ఆయిల్ వస్తుంది.

మనదేశంలో ఎక్కువగా పొడిని వాడతారు. ముఖ్యంగా మన దేశం నుండి విదేశాలకు మూడు రకాల మిర్చి అనేది ఎగుమతి అవుతున్నాయి. అవి ఏమిటి అంటే ఫుల్ మిర్చి, స్టెమ్కట్ మరియు స్టెంలెస్.

ఇది కూడా చదవండి..

మిర్చి రికార్డు ధర క్వింటా 80 వేలు ...

Related Topics

chilli high demand khammam

Share your comments

Subscribe Magazine