News

Tomatoes Price : రూ. 1 కి కిలో టమాటా ... పంటను రోడ్లపై పడేసి వెళ్తున్న రైతులు !

Srikanth B
Srikanth B

ఆర్థిక నష్టాన్ని నివారించడానికి, టమోటాలకు రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించాలని రైతులు కోరారు. "ప్రభుత్వం కనీస మద్దతు ధర హామీ ఇస్తే అది మాకు చాలా సహాయపడుతుంది అనే రైతులు వెల్లడించారు.

తమిళనాడులోని మరాండహళ్లి జిల్లాలో రైతులు తమ ఉత్పత్తులకు సరైన ధర లభించకపోవడంతో టమోటాల ను రోడ్లపై పడేసి , పంటను దున్నేస్తున్నారు , టమోటాలకు ఫామ్గేట్ ధర కిలోకు రూ .2 మాత్రమే అని,  తద్వారా మేము తీవ్రంగా నష్ట పోతున్నామని ,రైతు లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు .

"టమోటాలను పండించడానికి, మేము ప్రతి కార్మికుడికి రోజుకు 500  చెల్లించాలి, ఉత్పత్తిని కిలోకు రూ .2 కు అమ్మితే, మేము కోత కోసం పెట్టె ఖర్చుకూడా కూడా తిరిగి పొందలేము  అని మరాండహళ్ళి రైతు  పి తంగవేలు చెప్పారు.

గణనీయమైన ఆర్థిక నష్టం కారణంగా వారు ఉత్పత్తిని సేంద్రీయ ఎరువుగా ఉపయోగించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

"సాధారణంగా, మేము తదుపరి పంట కోసం సిద్ధం చేయడానికి భూమిని దున్నుతాము. మేము ఈ సారి ఉత్పత్తితో పాటు మొక్కలను కూడా దున్నేసి , వాటిని తరువాతి పంటకు సేంద్రియ ఎరువుగా ఉపయోగించాలని నిర్ణయించుకున్నాము .

జిల్లాలోని పాలకోడ్, మరందహళ్లి, కరిమంగళం గ్రామాలలో టమోటాలు విరివిగా పండించబడుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా  10,000 ఎకరాలకు పైగా టమోటాలు పండించబడుతున్నాయని,"పండించిన పంటను పాలకోడ్ మార్కెట్కు తీసుకువస్తారు, అక్కడ నుండి చెన్నై, హోసూరు, కోయంబత్తూర్ మరియు బెంగళూరు వంటి ప్రాంతాలకు పంపిణీ చేస్తారు" అని రైతు చెప్పారు.

పాలకోడే టమోటా మార్కెట్ లో వ్యాపారి ఎం.సురేష్ ప్రకారం, వారు రోజుకు 100 టన్నుల టమోటాలను వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తారు.మూడు నెలల క్రితం టమోటాలను కిలో రూ.100కు విక్రయించారు. ఇప్పుడు దీని ధర కిలోకు 1-2గా ఉంది.

ఆర్థిక నష్టాన్ని నివారించడానికి, టమోటాలకు రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను నిర్ణయించాలని రైతులు కోరారు. "ప్రభుత్వం కనీస మద్దతు  ధరకు హామీ ఇస్తే అది మాకు చాలా సహాయపడుతుంది అని రైతులు తెలిపారు.

Cattle-rearing is Unlawful in city:పట్టణ ప్రాంతాల్లో 'పశువుల పెంపకం' చట్ట విరుద్ధమా?

Share your comments

Subscribe Magazine