News

పడిపోయిన పత్తి ధర.. నష్టాల్లో రైతులు

Gokavarapu siva
Gokavarapu siva

తెల్లబంగారంగా పిలవబడే పత్తి రైతులను నష్టాల్లోకి నెట్టుతుంది. పత్తి పంట వేసిన రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. పంట పండించాడనికి అప్పులు చేసి మరి రైతులు పండిస్తున్నారు. అధిక దిగుబడి రాకపోవడానికి ప్రకృతి వైపరీత్యాలు కారణమైతే దానికి తోడుగా నకిలీ విత్తనాలు కూడా తయారయ్యాయి. నకిలీ విత్తనాల వాళ్ళ దిగుబడులు తగ్గిపోయాయి, దీనితో పాటు మార్కెట్ దళారులు మద్దతు ధర తగ్గించడంతో రైతులు కష్టాలు పడుతున్నారు.

ఆసిఫాబాద్‌ జిల్లాలో ఎక్కువగా పత్తి పంటను సాగుచేస్తారు. ఈ సంవత్సరం ఆసిఫాబాద్‌ జిల్లాలో రైతులు 3.5 లక్షల ఎకరాల్లో పత్తి సాగును చేశారు. ప్రతి ఏడాది పత్తి పంటకు మార్కెట్ లో ధరలు బాగానే పలుకుతాయి. కానీ ఈ సంవత్సరం నకిలీ విత్తనాలు మరియు ప్రకృతి వైపరీత్యాల వాళ్ళ అనుకున్న విధంగా దిగుబడులు పత్తి పంటల నుండి రాలేదు. మొదట్లో పత్తి ధరలు బాగానే పలికాయి, అనగా రూ.9200 ఒక క్వింటాలుకు వచ్చింది. కానీ రాను రాను ఈ పత్తి ధరలు తగ్గుముఖం పట్టాయి.

వ్యాపారులు సిండికేట్లుగా మారి రైతులను నష్టాల్లో ముంచుతున్నారు. దీనితో పత్తి ధర భారీగా తగ్గిపోయింది. ఇప్పుడు పత్తి ధర మార్కెట్లో క్వింటాలుకు రూ.7500 నుండి రూ.7700 ధర పలుకుతుంది. దిగుబడి తగ్గినా ధరలు బాగానే ఉంటాయి అనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. పతిని పండించిన రైతులు నష్టాల్లో మునుగుతున్నారు.

ఇది కూడా చదవండి..

తెలంగాణాలో కొనుగోలు లేకపోవడంతో మహారాష్ట్ర కు పత్తి అక్రమ తరలింపు..

ఎంత ఎదురు చుసిన పతి ధరలు పెరగకపోవడంతో రైతులు క్వింటాలు పతికి రూ.15000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు కూడా చేసారు. ఫిబ్రవరి 6న జిల్లాలో రైతు హక్కుల పోరాట సమితి ద్వారా బంద్ కూడా నిర్వహించారు. ఇంత జరిగిన అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో రైతులు నిరాశ చెందారు. పత్తి ధర పెరుగుతుందనే చిన్న ఆశతో రైతులు ఇన్ని రోజులు పత్తిని ఇంటివద్దనే నిల్వ చేసారు. ప్రతి రోజు తగ్గుముఖం పడుతున్న పత్తి ధరలను చూసి రైతులు చేసేది ఏమిలేక పండించిన పత్తి పంటను తక్కువ ధరలకే అమ్ముకుంటున్నారు.

ఇది కూడా చదవండి..

తెలంగాణాలో కొనుగోలు లేకపోవడంతో మహారాష్ట్ర కు పత్తి అక్రమ తరలింపు..

Share your comments

Subscribe Magazine

More on News

More