News

రైతులకు శుభవార్త.. ఈ పెయింట్ తో అధిక ఆదాయం.. ఎలానో తెలుసా?

KJ Staff
KJ Staff

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం ఆవుపేడతో తయారు చేసిన పెయింట్ (ఖాది పెయింట్) ను కేంద్ర ప్రభుత్వం మార్కెట్లోకి తీసుకువచ్చింది. రైతులకు అదనపు ఆదాయాన్ని కలిగించడమే దీని ఉద్దేశం.డిస్టెంపర్, ఎమల్షన్‌లో వచ్చే ఈ పెయింట్ పర్యావరణ స్నేహపూర్వక, విషరహిత, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ వంటి లక్షణాలను కలిగి ఉండటమే కాకుండా కేవలం నాలుగు గంటల సమయంలోనే ఈ పెయింట్ ఆరిపోతుంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆధారంగా ప్రతి సంవత్సరం రైతులకు సుమారుగా 50 నుంచి 50 వేల వరకు అదనపు ఆదాయం ఉండబోతుందని ఖాదీ ఇండియా నుండి వేద పెయింట్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఇందులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పశుసంవర్ధక మంత్రి గిరిరాజ్ సింగ్, KVIC చైర్మన్ వినాల్ కుమార్ సక్సేనా పాల్గొననున్నారు.

ఇదిలా ఉండగా ఈ విధంగా ఆవుపేడతో తయారు చేసేటటువంటి నేచురల్ ఖాది పెయింటింగ్ కి కేంద్ర రహదారి రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తనను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు. ఈ క్రమంలో జైపూర్ లో ఉన్న ఖాదీ నేచురల్ పెయింట్స్ కొత్త ఆటోమేటిక్ ప్లాంటిన నితిన్ గడ్కరీ ప్రారంభించారు.ప్రస్తుతం ఈ విధమైనటువంటి నేచురల్ పెయింటింగ్స్ రోజుకు 500 లీటర్ల వరకు ఉత్పత్తి అవుతోందని, ఇక నుంచి రోజుకు వెయ్యి లీటర్ల వరకు సామర్థ్యం పెంచాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ విధంగా ఖాదీ నేచురల్ పెయింటింగ్స్ ఆవు పేటకు అధిక డిమాండ్ ను కల్పిస్తుందని,ఈ సందర్భంగారైతులు ఆవుపేడను సరఫరా చేయడం ద్వారా సంవత్సరానికి 50 వేలకు పైగా అధిక ఆదాయాన్ని పొందవచ్చని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు.

Share your comments

Subscribe Magazine

More on News

More