News

తెలంగాణ రైతులకు శుభవార్త... ఆ రోజే పంట రుణాలు మాఫీ?

KJ Staff
KJ Staff

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి వ్యవసాయంలో అండగా నిలవాలని ఎన్నో పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తున్నారు. దానికి తోడు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు వ్యవసాయ రుణాల మాఫీ పథకం.ఇందులో భాగంగా ఆర్థికమంత్రి హరీశ్ రావు బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేయబోతున్నట్టు ఆర్థిక మంత్రి హరీశ్ రావు బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది రైతులకు భారీగా లబ్ధి పొందుతున్నారు.ఇందులో భాగంగా రైతుల ఖాతాల్లోకి 2,006 కోట్ల రూపాయలు రుణమాఫీ డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. అనుకున్నట్లుగానే ఆగస్టు 16 నుంచి రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొమ్మును జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడువు నిర్ణయించింది.

అయితే రైతు రుణమాఫీ సొమ్మును ఏ ఇతర ఖాతాల్లో జమ చేయొద్దని బ్యాంకర్లుకు ప్రభుత్వం సూచించింది. పూర్తి రుణ మాఫీ రైతులు ఖాతాలోనే జమ చేయాలని ప్రభుత్వం బ్యాంకర్లను ఆదేశించింది. అలాగే రుణమాఫీ పొందిన రైతుల రైతుల అకౌంట్లు జీరో చేసి అర్హులైన ప్రతి రైతుకు కొత్త వ్యవసాయ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకర్లను కోరింది.

Share your comments

Subscribe Magazine