రైతులకు రుణం కాదు, MSP కనీస మద్దతు ధర హామీ పై చట్టం కావాలని దేశ రాజధాని ఢిల్లీలో మరో రైతు ఉద్యమం నడిపేందుకు వివిధ రైతు సంఘాలు సన్నాహాలు చేస్తున్నాయి . యునైటెడ్ కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులు మార్చి 20న పార్లమెంట్ ముట్టడికి రైతు సంఘాలు అదేవిధంగా రైతులు సిద్ధమవుతున్నారు.
ఢిల్లీలోని ప్రభుత్వ ఇంటర్ కళాశాల మైదానంలో నిర్వహించిన కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్‌లో రెండో విడత ఆందోళనను ప్రకటించారు. సంయుక్త కిసాన్ మోర్చా, భారతీయ కిసాన్ యూనియన్, హర్యానా, యూపీకి చెందిన ఖాప్ చౌదరీల చర్చల అనంతరం కనీస మద్దతు ధర హామీ చట్టం కోసం దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పార్లమెంట్ భవనం వద్ద మహాపంచాయత్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
భారతీయ కిసాన్ యూనియన్, యునైటెడ్ కిసాన్ మోర్చా నాయకులు సన్నాహాల కోసం దేశవ్యాప్తంగా పర్యటించనున్నట్లు భకియు జాతీయ ప్రధాన కార్యదర్శి యుధ్వీర్ సింగ్ తెలిపారు. చౌదరి రాకేష్ టికాయత్ వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు.
భారీగా యాసంగిలో వరి నాట్లు
రైతుల వ్యవసాయ పొలాలకు కరెంటు మీటర్లు బిగిస్తే ఊరుకునేది లేదని.. ఇందుకు పోలీసులు, అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. బావులకు మీటర్లు బిగించడం మానుకోవాలని భకియు ప్రతినిధి డిమాండ్ చేశారు. పేదల దోపిడీ కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. రైతు సంఘం ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకం కాదన్నారు. ప్రభుత్వం ఎక్కడ రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందో అక్కడికే వెళ్తామన్నారు.
Share your comments