News

భారీగా యాసంగిలో వరి నాట్లు

KJ Staff
KJ Staff

తెలంగాణ రాష్ట్రానికి చెందిన యాసంగిలో సాగు గమణియంగా పెరిగింది. 47.85 లక్షల ఎకరాల్లో సాధారణ పంటల సాగు ఈ సీసన్ లో జరగగా, మొత్తం అన్ని పంటలు కలిపి 63.79 ఎకరాల్లో సాగయ్యాయి. అనగా 133 శాతం సాధారణ విస్తీర్ణంలో సాగయ్యాయి. గత సంవత్సరం 35.84 లక్షల ఎకరాల్లో యాసంగిలో వారి నాట్లు నాటగా, ఇప్పుడు ఏకంగా 48.86 లక్షల ఎకరాల్లో వారి నాట్లు పడ్డాయి. 2020-21 యాసంగి సీజన్లో ఏకంగా 52.28 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ఆ రికార్డు ఈసారి దాటుతుందని అంటున్నారు.

రానున్న వారాల్లో వరి సాగు విస్తీర్ణం ఆల్టైం రికార్డు దిశగా వెళ్లనుందని వ్యవసాయ వర్గాలు అంటున్నాయి. ఇది ఇలా ఉండగా మొక్కజొన్న యొక్క సాదరణ సాగు 4.64 లక్షల ఎకరాలు ఉండగా, ఇది ఇప్పటి వరకు 5.97 లక్షల ఎకరాల్లో సాగైయింది. జొన్న సాధారణ సాగు విస్తీర్ణం 88 వేల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.07 లక్షల ఎకరాల్లో సాగైంది. శనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.56 లక్షల ఎకరాల్లో సాగైంది. వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.02 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.38 లక్షల ఎక రాల్లో సాగైంది. అంటే 78.65 శాతానికి పరిమితమైంది.

ఇది కూడా చదవండి..

వరి పంటలో అగ్గి తెగులు నివారణ ..

తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి 32 జిల్లాలు ఉండగా, కేవలం 4 జిల్లాలో మాత్రమే వంద శాతం లోపు పంటలు సాగయ్యాయి. మంచిర్యాల జిల్లాలో 92.40 శాతం, ములుగు 83.84 శాతం, రంగారెడ్డి జిల్లాలో 76.16 శాతం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యంత తక్కువగా 57.97 శాతం సాగయ్యాయి. మిగిలిన ప్రతి జిల్లాలో వంద శాతం సాగు దాటింది. ఏడు జిల్లాల్లో 150 శాతానికి మించి పంటలు సాగయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 159.12 శాతం, మెదక్ జిల్లాలో 158.25 శాతం, సంగారెడ్డి జిల్లాలో 156.38 శాతం, సిద్ధిపేట జిల్లాలో 163.49 శాతం, జనగాం 151.51 శాతం, మహబూబ్ నగర్ 150.57 శాతం, యాదాద్రి జిల్లాలో 167.66 శాతం పంటలు సాగయ్యాయి. పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేస్తున్నామని, ఎక్కడా ఇబ్బంది. కావడంలేదని ఆగ్రోస్ ఎండీ కె.రాములు తెలిపారు.

ఇది కూడా చదవండి..

వరి పంటలో అగ్గి తెగులు నివారణ ..

Share your comments

Subscribe Magazine