News

వరి పంటలో అగ్గి తెగులు నివారణ ..

Srikanth B
Srikanth B

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన పంట వరి , వరి నాటిన దగ్గర నుంచి పంటను అనేక రకాల తెగుళ్లు ఆశిస్తుంటాయి , ఈ తెగుళ్లకు సరైన సమయం లో నిర్ములించకపోతే పంటకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి , అలాంటి తెగుళ్లలో అగ్గి తెగుళ్లు ఒకటి .

నారుమడిలో మరియు నాటిన వరిపైరు తొలిదశలో ఆకులపైన నూలుకండె ఆకారంలో మచ్చలు ఏర్పడి క్రమేణా అనుకూల వాతావరణ పరిస్థితులలో ఇవి పెద్దవై మచ్చల చివర్లు మొనదేలి ఉంటాయి. ఈ మచ్చల అంచులు ముదురు గోధుమ రంగు లేదా నలువు రంగులో వుండి మచ్చల మధ్య భాగం బూడిద లేదా తెలుపు రంగులో ఉంటాయి.

అనుకూల వాతావరణ వరిస్థితులలో మచ్చలు ఒకదానితో ఒకటి కలిసి పోయి ఆకులు పాక్షికంగా లేదా పూర్తిగా ఎండిపోతాయి. క్రమేణా తెగులు సోకిన మొక్కల ఆకులు ఎండిపోయి దూరం నుండి చూస్తే తగులబడినట్లు కనిపిస్తుంది. అందువల్లే ఈ తెగులును అగ్గి తెగులుగా పిలుస్తారు.

ప్రస్తుతం యాసంగి వరిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు - యాజమాన్య చర్యలు

 

అగ్గి తెగులు లేక మెడ విరుపుతెగులు
ఆకుల పై ముదురు గోధుమ రంగు అంచుతో మధ్యలో బూడిద రంగుగల నూలుకండే ఆకారపు మచ్చలు ఏర్వడతాయి.ఆకులు ఎండిపోయి తగులబడినట్లు కనిపిస్తాయి.వెన్నుల మెడభాగంలో ఈతెగులు ఆశి౦చి వెన్నులువిరిగిపోతాయి.

నివారణ
తట్లుకొను శక్తి గల రకాలనుసాగుచేయాలి.కిలో విత్తనానికి ౩ గ్రా.కార్భ౦డజియ్ కలిపి విత్తనశుద్ది చేయాలి.ట్రైసైక్లోజోల్ 75 శాతం 0.6గ్రా లేదా ఎడిఫెన్ఫాన్ 1 మి.లీ.లీటరు నీటికి కలిపి పైరు పైపిచికారి చేయాలి.చేనులోను,గట్లపైన కలుపు నివారించాలి.

ప్రస్తుతం యాసంగి వరిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు - యాజమాన్య చర్యలు

Related Topics

Growing paddy

Share your comments

Subscribe Magazine