రైతులు ఎంతో కష్టపడి పంటను సాగు చేస్తే దళారులు ఆ పంటను తక్కువ ధరకు తీసుకొని రైతులను మోసం చేస్తుంటారు. ఈ విధంగా ఏకంగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వారికి డబ్బు ఇవ్వకుండా రైతులకు సుమారు 60 కోట్ల రూపాయలను ఎగ్గొట్టి దారుణంగా మోసం చేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
విజయవాడలోనీ పల్లవి రైస్ మిల్లర్ యజమాని విశ్వనాథం చేతిలో రైతులు భారీగా మోసపోయారు.ఉభయగోదావరి జిల్లాలతో పాటు, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కాకినాడ, కృష్ణాజిల్లా, తెలంగాణ, ఖమ్మం జిల్లాలలోని రైతుల దగ్గర రైస్ మిల్లు యజమాని ధాన్యాలను కొనుగోలు చేసి వారికి డబ్బులు ఇవ్వకుండా తిరుగుతున్నారు. యజమాని విశ్వనాథమ్ వివిధ జిల్లాల రైతులకు సుమారుగా 60 కోట్లు ఎగవేసినట్లు రైతులు వాపోయారు.
ఈ క్రమంలోనే 2015 వ సంవత్సరంలో 54 మంది బకాయిపడ్డ రైతులు, వ్యాపారులకు 25 కోట్లు చెల్లిస్తానని విశ్వనాధం అగ్రిమెంట్ చేశారు.అయితే ఇప్పటి వరకు ఆ అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు విజయవాడలోని రామ మందిరం వద్ద విశ్వనాధం ఇంటికి చేరుకున్నారు. అయితే విశ్వనాధం ఇంటికి తాళం వేయడంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.మమ్మల్ని నమ్మించి దారుణంగా మోసం చేశారని ఎలాగైనా మా డబ్బులు మాకు తిరిగి చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు విశ్వనాధం ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.
Share your comments