News

రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందొద్దు : వ్యవసాయ మంత్రి నిరంజన్‌ రెడ్డి

Srikanth B
Srikanth B

శనివారం అసెంబ్లీ లో చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు.. రైతు రుణమాఫీ విషయంలో స్పష్టత లేదని విమర్శించారు రుణమాఫీ పై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి, అలాగే పత్తి కోసం కేంద్రం తక్కువ నిధులు కేటాయించిన తరుణంలో కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వంపై భారం ఎక్కువ పడుతోందని తెలిపారు. అయితే బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.68,500 కోట్ల కేటాయించామని నిరంజన్ రెడ్డి తెలిపారు. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు.

"వ్యవసాయ విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్. ప్రతి వంద యూనిట్లలో 37 శాతం వ్యవసాయానికే వినియోగం. రైతు బీమా తరహా పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులకు ఇచ్చిన ఏ హామీని కేంద్రం అమలు చేయలేదు.కనీస మద్దతు ధర విషయంలో రైతులను కేంద్రం మోసం చేస్తోంది." - సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

90 వేల లోపు రైతు రుణాల మాఫీ .. అమలు అవుతోందా ?

కనీస మద్దతు ధర విషయంలో రైతులను కేంద్రం మోసం చేస్తోంది: రైతులకు ఇచ్చిన ఏ హామీని కేంద్రం అమలు చేయలేదని నిరంజన్‌ రెడ్డి ఆరోపించారు. కనీస మద్దతు ధర విషయంలో రైతులను కేంద్రం మోసం చేస్తోందని విమర్శించారు. పత్తి కొనుగోళ్లకు కేంద్రం రూ.లక్ష మాత్రమే పెట్టి.. రైతులను అవమానించిందని తెలిపారు. దీనిపై పత్తి రైతులు బాధపడాల్సిన అవసరం లేదని వివరించారు. కోతుల బెడదపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పారు. కొహెడలో ఆసియాలోనే అతి పెద్ద ఫ్రూట్ మార్కెట్ వస్తుందని.. సీఎం ఆమోదంతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

90 వేల లోపు రైతు రుణాల మాఫీ .. అమలు అవుతోందా ?

Related Topics

minister niranjan reddy

Share your comments

Subscribe Magazine

More on News

More