News

రైతులు పంటల ఎంపికలో వైవిధ్యతని చూపించాలి... వరిపై ఎలాంటి ఆంక్షలు లేవు...వ్యవసాయ శాఖ మంత్రి!

S Vinay
S Vinay

యాసంగి పంటలపై (KHARIF SEASON CROPS ) ప్రభుత్వం ఆంక్షలు పెడుతున్నారంటూ సాగుతున్న ప్రచారంపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ, వరి పంటను సాగు చేయడం పై ఎలాంటి ఆంక్షలు లేవని లాభసాటి పంటలు పండించేలా రైతులను ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.

అయితే యాసంగిలో(KHARIF) వరి సాగుకి(PADDY) ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా చాలా మంది రైతులు పత్తి సాగు చేపట్టలేదు. దీని వల్ల ఆశించిన లాభాలు రాబట్టలేకపోయామని తెలిపారు.

పత్తి పంటకి క్వింటాల్‌కు కనిష్ట ధర రూ.5,726, గరిష్టంగా రూ.6,025గా కేంద్రం ప్రకటించింది. కానీ బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.8,000 నుంచి రూ.12,000 వరకు ధర పలుకుతున్నదని, అందుకే రైతులు పత్తి సాగును విస్తృతంగా చేపట్టాలని కోరారు.రైతులు పత్తితో పాటు ఎర్రజొన్న సాగు చేయడం వల్ల రైతులకు మంచి లాభాలు వస్తాయి. ఎర్రజొన్న(JOWAR) సాగుకు అధిక పెట్టుబడి అవసరం లేదని అంతే కాకుండ నీటి నిర్వహణ శ్రమ ఉండదని రైతులకు సుమారుగా ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తోందని వ్యాఖ్యానించారు.

జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో మంచి డిమాండ్‌ ఉన్న పంటల సాగు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసింది. వరి సాగుతో పోలిస్తే ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఎక్కువ కూలీలు, పెట్టుబడి అవసరం లేదు. తక్కువ సమయంలో రైతులు మంచి లాభాలు పొందగలరు' అని నిరంజన్‌రెడ్డి అన్నారు.

వరితో పరిగణిస్తే పత్తి, కంది, పెసర్లు, మినుము వంటి ఇతర పంటలకు మార్కెట్లో భారీ డిమాండ్‌ ఉండటంతోపాటు కనీస మద్దతు ధరకి(MINIMUM SUPPORT PRICE) మించి బహిరంగ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని కాబట్టి రైతులు పంటల ఎంపికలో వైవిధ్యతని చూపించాలి అని కోరారు. పప్పు దినుసులు(pulses) పండించడం వల్ల భూసారం కూడా పెరుగుతుందని వ్యాఖ్యానించారు.

మరిన్ని చదవండి

KHARIF 2022: వర్షాకాలం పంటలకై తెలంగాణ ప్రభుత్వం ప్రణాలిక పత్తి పంటకి పెద్దపీట

Share your comments

Subscribe Magazine