News

ఈ నామ్ సైట్ హ్యాక్‌ అవ్వడంతో నష్టపోయిన రైతులు..

Gokavarapu siva
Gokavarapu siva

దేశంలోని రైతుల కొరకు కేంద్ర ప్రభుత్వం వినూత్నంగా ఈ-నామ్‌ (ఎలక్ట్రానిక్ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌) వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ-నామ్‌ ద్వారా రైతులకు ఆన్‌లైన్‌లో మార్కెటింగ్‌ సౌకర్యాలను ప్రభుత్వం కలిస్తుంది. ఈ ఈ-నామ్‌ వెబ్‌సైట్‌ను హిందీ, ఇంగ్లిష్‌ భాషలతోపాటు గుజరాతీ, మరాఠీ, తమిళ్‌, బెంగాళీ, ఒడియా భాషల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 479 మార్కెట్లు ఈ-నామ్‌ పరిధిలో ఉన్నాయి.

రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ ఈ-నామ్‌ ప్రారంభిస్తే వాటిని వ్యాపారులు దుర్వినియోగం చేస్తున్నారు. మహబూబాబాద్ కు చెందిన వ్యాపారులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారు పాడిందే పాటగా మారింది. ఈ వెబ్‌సైట్‌ను ఇక్కడి వ్యాపారులు హ్యాక్ చేస్తున్నారు. ఇలా చేసి వ్యాపారులు అధిక లాభాలను పొందుతున్నారు. దీనితో రైతులు నష్టాల పాలవుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర అందించాలనే ఉద్దేశంతో ఈ నామ్ పథకాన్నీ ప్రవేశపెట్టింది. రైతుల నమ్మకాలను వమ్ము చేస్తూ గత రెండు ఏండ్లుగా ఈ నామ్ సైట్‌ను హ్యాక్ చేస్తూ తన దందాను యథేచ్ఛగా కొనసాగుస్తూన్నప్పటికి అడ్డుకునే వారే కరువయ్యారు. ఈవిధంగా జరుగుతుండడంతో రైతులకు దీనిపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. అధికారులు కూడా ఈ హ్యాకింగ్ పై సరిగ్గా చర్యలు తీసుకోవట్లేదని ఆరోపణలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి..

పత్తి రైతులకు ఊరట.. పెరిగిన ధర

ఈ నామ్ సైట్‌లో టెండర్ ద్వారా వేసిన కోడ్ ఆధారంగా రైతులు విక్రయానికి తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తులు కేటాయింపు జరుగుతుంది. వ్యాపారులు సీక్రెట్‌గా వేసే ధరల ద్వారా రైతులకు లాభం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ తోటి వ్యాపారులు వేసే ధరలను ముందుగానే తెలుసుకొని నాణ్యమైన సరుకులను మాత్రమే కొనుగోలు చేస్తూ లక్షల రూపాయలు సంపద ను కూడా బెట్టాడు ఓ వ్యాపారి.

ఆ వ్యాపారి కూడా టెండర్లను ఒక్క రూపాయి తేడాతో దక్కించుకోవడంతో అధికారులు అనుమానం వచ్చి విచారణ చేశారు. ఈ విచారణ అనంతరం ఈ నామ్ సైట్ హ్యాక్ అయినట్లు తెలిపారు. హ్యాక్ చేసిన వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఆలస్యంగా పరిష్కరించడంతో అధికారులు రైతులకు న్యాయం చేయలేకపోయారు అని అంటున్నారు. మోసపోయిన రైతులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి..

పత్తి రైతులకు ఊరట.. పెరిగిన ధర

Related Topics

E Nam Portal hack farmers

Share your comments

Subscribe Magazine

More on News

More