ఫిబ్రవరి 14వ తేదీని వాలంటైన్స్ డే (ప్రేమికుల రోజు ) జరుపుకుంటున్న విషయం తెలిసిందే , అయితే దీనిని మన సంస్కృతి కాదని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు ఇది భారతీయ సంస్కృతి కాదనే వాదనలు ఉన్నాయి. బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ వంటి హిందూ సంస్థలు దీనికి వ్యతిరేకం. ఇది భారతీయుల సంప్రదాయం కాదని, ఇలాంటివాటిని ప్రోత్సహించకూడదాని ఎప్పటి నుంచో వాదిస్తున్నారు .
వాలంటైన్స్ డే నాడు బజరంగ్ దళ్, వీహెచ్‌పీ నాయకులు పార్కుల్లో మోహరిస్తుంటారు. తమ కంటికి కనిపించిన ప్రేమజంటలను అప్పటికప్పుడు పెళ్లి చేస్తుంటారు. పార్కుల్లో లవర్స్ మీద వారు దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లల్లో పరస్పరం కేసులు నమోదు చేసుకున్న సంఘటనలు కోకొల్లలు.
ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 14వ తేదీని కౌ హగ్ డే గా జరుపుకోవాలంటూ దేశ ప్రజలను సూచించింది. ఈ మేరకు పశు సంవర్ధక శాఖ బోర్డ్ ఇవ్వాళ సర్కులర్ ను జారీ చేసింది. ఫిబ్రవరి 14వ తేదీ నాడు ప్రతి ఒక్కరు గోవును ఆలింగనం చేసుకోవాలని, మూగప్రాణుల పట్ల తమకు ఉన్న అనుబంధాన్ని చాటుకోవాలని ప్రకటన జారీ చేసింది.
ఈ ఉత్తర్వులు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. సోషల్ మీడియా వేదికగా భారీగా మీమ్స్ పడ్డాయి. ఈ కాన్సెప్ట్ ను నెటిజన్లు ట్రోల్స్ చేశారు. ఇంటర్నేషనల్ టైగర్ డే నాడు పులులను కౌగిలించుకోవాలా? అంటూ ప్రశ్నలు సంధించారు. ప్రధాని ఆదేశాల మేరకు గతంలో దీపాలు వెలిగించాం, చప్పట్లు కొట్టాం.. ఇప్పుడు ఆవుతో సెల్ఫీ దిగాలా? అంటూ చురకలు అంటించారు. విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కౌ హగ్ డేను రద్దు చేసింది.
Share your comments