మనిషి ఎదుగుతున్న క్రమం లో విజ్ఞతను కోల్పోయి ప్రవర్తిస్తున్నాడు . మనం కూడా ప్రకృతి నుంచే వచ్చామన్న జ్ఞానం మరచి ప్రకృతి లోని జీవులకు భూమి పై హక్కు లేదన్నట్లుగ ప్రవర్తిస్తున్నాడు . అలాంటి మానవీయత లేని ఘటన తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది . ఎద్దు మూత్రం పోసినందుకు రైతుకు వెయ్యి రూపాయలు ఫైన్ వేసిన వింత ఘటన ఇప్పుడు అంతట చర్చనీయాంశం అయినది .
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎద్దు మూత్రం పోసినందుకు వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాడు ఓ రైతు. ఇల్లందు పట్టణంలోని నెంబర్ టు బస్తీలో నివాసముండే సుందర్ లాల్ ఎద్దుల బండి తోలుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక సింగరేణి జీఎం కార్యాలయం ముందు నుండి మట్టి తీసుకొని వెళుతున్న క్రమంలో జీఎం కార్యాలయం ముందు ఎద్దు ఆగి మూత్రం పోసింది. ఇది చూసిన జీఎం కార్యాలయ సిబ్బంది వెంటనే ఎద్దుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు సుందర్ లాల్ ను పోలీసు స్టేషన్ కు పిలిపించారు. అప్పటికి బెదురుతూ వెళ్లిన రైతుకు పొలిసు సిబ్బంది జీఎం ఆఫీసు ముందు ఎద్దు మూత్రం పోసినందుకు కంప్లైంట్ వచ్చింది ,ఎద్దుపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తామని చెప్పారు. పోలీసులు చెప్పింది విన్న రైతు షాక్ కు గురయ్యాడు అసలు ఎద్దు మూత్రం పోసినందుకు ఫైన్ కట్టడం ఏంటి సార్ అని పోలీసుల ఎదుట బాధపడ్డాడు. ఎద్దు మూత్రం పోసినందుకు కోర్టు అతనికి జరిమానా విధించింది.
Perennial Rice23 :ఒక్కసారి నాటితే నాలుగేళ్లు పండే వరిని అభివృద్ధి చేసిన చైనా
కుటుంబాన్ని పోషించే స్థోమతలేని రైతు భాదనుచూసిన కోర్టు పోలీస్ సిబ్బంది ఒకరు ఫైన్ కు సంబందించిన డబ్బులను కోర్టు కు చెల్లించి రైతుకు రసీదు ఇచ్చి పంపించాడు . ఎద్దు మూత్రం పోసినందుకు ఫైనే వేసిన ఘటన ఇప్పుడు రాష్ట్రం మొత్తం చర్చనీయాంశమైనది.
Share your comments