ఎడారి ప్రాంతాల్లో వర్షాలు కురవడం చాల అరుదుగా చూస్తుంటాం. యునైటెడ్ ఎమిరేట్స్ అరబ్(UAE) ఎడారి ప్రాంతాలు, ఇక్కడ వానలు పడటం గగనం. ఇప్పటివరకు అక్కడి ప్రభుత్వం వానలు కురవడానికి క్లౌడ్ సీడింగ్ అనే పద్ధతి ద్వారా కుత్రిమంగా మేఘాలు వర్షించే విధంగా చేసేవారు
అయితే మంగళవారం సాయంత్రం, దుబాయిలో భారీగా వర్షాలు కురిసి, రోడ్లు, రహదారులు జలమయమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రేండింగ్ గా మారాయి. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే దుబాయ్ ఎయిర్పోర్ట్ రన్వే నీట మునిగి ఫ్లైట్లు రావడానికి వీలులేకుండా అయ్యింది. దీని మూలంగా అక్కడ ఆగే ఫ్లైట్లను దారి మళ్లించడం జరిగింది.
భారీగా కురిసిన వర్షాలకు, జనజీవనం స్థంభించింది. ఒక్క రోజే సుమారు 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలుస్తుంది. నైరుతిలో అల్పపీడనం ఏర్పడి ఈ భారీ వర్షాలకు దారి తీసిందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో అబుదాబి, షార్జా నగరాలకు వర్ష సూచన ఉన్నట్లు, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.
భారీ వర్షాలకు దుబాయిలోని షాపింగ్ మాల్స్, మరియు కొన్ని బిల్డింగ్స్ నీట మునిగాయి. ప్రధాన రవాణా మార్గమైన మెట్రోలైన్ నీట మునిగి, రవాణా స్థంభించింది. ఇటీవల కాలంలో దుబాయ్ టూరిస్ట్ కంట్రీగా రూపుదిద్దుకుంది. ప్రతిఏటా లక్షల్లో టూరిస్టులు దుబాయిని సందర్శిస్తున్నారు. నిన్న కురిసిన వర్షాలకు రోడ్లన్నీ నీట మునగడంతో, సందర్శకులు భయాందోళనకు గురయ్యి, వారి అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
అంతేకాకుండా దుబాయ్ పక్క దేశాలైన ఒమాన్, మస్కట్ మొదలగు దేశాల్లో భారీ వర్షపాతం నమోదయ్యింది. అధిక వర్షాల కారణంగా 18 మృతి చెందారు. వరదల్లో చిక్కుకుని గల్లంతైనవారి ఆచూకీ తెలియవలసి ఉంది మూడు రోజులుగా ఎడతెరపి లేని వర్షాల కారణంగా ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుండి ఎంతో మంది ప్రజలు ఈ దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్తూ ఉంటారు, ఈ సమయంలో వారి పరిస్థితి మరింత దారుణంగా ఉండనుంది. ఆగకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు అన్ని మూసుకుపోయాయి, దీని వలన సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది.
Share your comments