News

ఒక కిలో బియ్యం రూ. 500/- శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, పేపర్లు లేక ఏకంగా పరీక్షలే ఆపేసారు.

S Vinay
S Vinay

మన పొరుగు దేశం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో ఆహార పానీయాల ధరలు భారీగా పెరిగాయి. నిత్యావసర వస్తువలకి రెక్కలొచ్చాయి.వీటిని కొనేందుకు ప్రజలు గంటల తరబడి క్యూలో నిరీక్షించాల్సి వస్తుంది. దేశం మొత్తం ఇప్పుడు విలవిలలాడుతుంది. సామాన్యులే కాకుండా ధనిక వర్గాలకి కూడా రోజు రోజువారీ జీవితం కష్టతరంగా మారింది.

ప్రస్తుతం ప్రాథమిక ఆహార పదార్థాల ధరలు చూసినట్లయితే ఒక కిలో బియ్యం రూ 500, 400 గ్రాముల పాలపొడి రూ. 800 ఒక చాయ్ ధర రూ 100కి పైనే ఉంది, ఒక కిలో కోడిమాంసం రూ. 1000. పరీక్షలు నిర్వహించడానికి (కాగితం) పేపర్ లేక ఏకంగా పరీక్షలే ఆపేసారు అంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు ధరలు కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి.శ్రీలంకలో వున్నా తమిళ ప్రజలు భారత్ లోకి రావడానికి మొగ్గు చూపుతున్నారు. బారిసంఖ్య లోనే శ్రీలంక వాసులు భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు.

ఈ సంక్షోభానికి కారణం ఏంటి:
శ్రీలంక ప్రస్తుతం ఎదుర్కొంటున్న గడ్డు కాలానికి కరోనా మహమ్మారి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. శ్రీలంకకి ప్రధాన ఆర్ధిక వనరు పర్యాటక రంగం. ఇది కరోనా దెబ్బకి ఒక్కసారిగా కుదేలయింది. దీని ప్రభావం శ్రీలంక ఆర్థిక రంగంపై విపరీతమైన ప్రభావాన్ని చూపించింది.శ్రీలంక తీసుకున్న కొన్ని అనాలోచిత కారణాలు కూడా ఈ సంక్షోభానికి ఒక కారణం, వ్యవసాయంలో సేంద్రీయ ఎరువులను ప్రోత్సహించాలని ఒక్కసారిగా రసాయనిక ఎరువులని నిలివేసింది దీని కారణంగా టీ ట్రేడ్ ఒక్కసారిగా పడిపోయింది.
శ్రీలంక గోధుమ,చక్కర మరియు పెట్రోలియం ని ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకుంటుంది. రష్యా,ఉక్రెయిన్ మధ్య నడుస్తున్న యుద్ధం కారణంగా దిగుమతులపై తీవ్ర ప్రభావం ఏర్పడింది.

శ్రీలంక ద్రవ్యోల్బణం విపరీతంగా పడిపోయింది. ప్రస్తుతం 7 బిలియన్ డాలర్లకి పైనే అప్పులో ఉంది. చైనా మరియు భారత్ అప్పులు ఎక్కువగా ఇచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితిల్లో వడ్డీలు కూడా కట్టలేని దయనీయ స్థితిలో ఉంది. ఆర్థికంగా ఆదుకోవడానికి భారత్ మరియు చైనాలను కోరింది. శ్రీలంక ఆర్మీ భారత్ మత్సకారులపై వీలు చిక్కినప్పుడల్లా కాల్పులు జరుపుతూనే వుంది. అయినప్పకి భారత్ మొదటినుండి శ్రీలకంకి ఆర్థికంగా సహాయం చేస్తూనే ఉంది.

మరిన్ని చదవండి.

B.Sc. అగ్రికల్చర్ చదవాలనుకునే విద్యార్థులకి శుభవార్త!అగ్రికల్చర్ సీట్ల పెంపు ..

Share your comments

Subscribe Magazine