News

దేశంలో తొలిసారిగా గులాబీ రంగు టమాటాలు, తెలంగాణ ఉద్యానవన శాస్త్రవేత్తలు వినూత్నమైన సృష్టి, ప్రయోజనాలు తెలుసుకోండి.

S Vinay
S Vinay

మనం రోజు వాడే వంటల్లో టమాటా కచ్చితంగా ఉండాల్సిందే, దీని ప్రాముఖ్యత ఎలాంటిదంటే వంటగదిలో టమాటాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. సాధారణంగా టమాటాలు ఎరుపు రంగులో ఉంటాయి. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు భారతదేశం లోనే తొలిసారిగా గులాబీ రంగు టమాటాలను పండించారు.

సాధారణంగా థాయ్‌లాండ్, మలేషియా మరియు ఐరోపా దేశాలలో గులాబీ టమాటాలు ఎక్కువగా పండిస్తారు. అక్కడి వున్నా వాతావరణం కూడా వీటి ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. భారతీయ వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇవి అభివృద్ధి చేయబడ్డాయి. వంశపారంపర్య పద్ధతి. రెండు రకాల మధ్య సంకరణం జరపడం ద్వారా ఈ గులాబీ రంగు టమాటాలు అభివృద్ధి చేయబడ్డాయి.ఈ రకం 150-180 రోజుల కాల వ్యవధిలో సాగు చేయబడుతాయి. మరియు 55 రోజుల నుండి టమాటాలు పండటం ప్రారంభిస్తాయి. వీటి ధరలు కూడా అందరికి అందుబాటులో ఉంటాయి. ఈ సంకరజాతి గులాబీ టమాటాలు సాధారణ టమాటాలు కంటే అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం వీటి విత్తనాలను పరీక్షిస్తున్నారు.అతి త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నారు.

ఇది రుచిలో ఎక్కువ ఆమ్లత్వం కలిగి ఉంటుంది. మనం చేసుకునే వంటకాలకు గులాబీ రంగును ఇస్తుంది. అయితే ఈ రకం మొక్కలలో ఉన్న సమస్య ఏమిటంటే టమాటా యొక్క చర్మం చాలా పలుచగా ఉంటుంది రవాణా చేసేటప్పుడు అది సులభంగా దెబ్బతింటుంది. దీని షెల్ఫ్-లైఫ్ కేవలం ఏడు రోజులు.

ప్రయోజనాలు తెలుసుకోండి.
గులాబీ టమాటాల్లో విటమిన్ A అధికంగా ఉంటుంది. ఫలితంగా కంటి చూపు మెరుగుపడుతుంది.
తక్కువ కాలంలోనే ఎక్కువ దిగుబడి వస్తుంది.
వీటిలో కాన్సర్ ని నిరోధించే గుణం ఉంది.
అంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి.

మరిన్ని చదవండి.

రాగి పాత్రలలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి.

Share your comments

Subscribe Magazine