తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేస్తామన్న గృహ జ్యోతి పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ పథకం ప్రకారం, తెలంగాణ ప్రజలు, కరెంటు వినియోగంలో 200 యూనిట్ల వరకు ఎటువంటి రుసుము చెలించవలసిన అవసరం లేదు. 200 యూనిట్లు దాటితే మాత్రం బిల్ చెల్లించాలి. ఐతే చాల మందిలో ఈ పథకంపై అనేక సందేహాలున్నాయి
వేసవి కాలం మొదలవుతుంది, ప్రజలు ఉక్కబోత తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడతారు. దీనితో ప్రతీ ఇంట్లో ఫ్యాన్ లేదా కూలర్ రోజంతా తిరుగుతూనే ఉంటాయి. కనుక వేసవి కాలంలో కరెంటు బిల్ కూడా అధికంగా వస్తుంది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ జ్యోతి పథకం ప్రకారం, 200 యూనిట్ల కరెంటు వినియోగం వరకు ఎటువంటి కరెంటు బిల్ చెల్లించవలసిన అవసరం లేదు, 200 యూనిట్లు దాటితే మాత్రం అదనంగా వాడిన యూనిట్లకు మాత్రమే కరెంటు బిల్ చెల్లించాలి. ఉదాహరణకు మీ నెలవారీ కరెంటు 210 యూనిట్లయితే, అదనంగా వాడిన 10 యూనిట్లకు మాత్రమే కరెంటు బిల్ చెల్లించాలి.
అలాగే ఈ పథకం వర్తించడానికి, మీరు తెలంగాణ వాసులై ఉండాలి. తెలంగాణలో స్థిరంగా నివాసం ఉంటూ మీ పేరు మీద కరెంటు కనెక్షన్ నమోదై ఉండాలి. వేసవి కాలం సమీపిస్తుండటం వల్ల కరెంటు వినియోగాన్ని తగ్గించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అదనపు కరెంట్ వినియోగం ద్వారా బిల్ మాత్రం తప్పకుండ చెల్లించాలి.
Share your comments