పళ్ళ వ్యాపారాలు మరియు డీలర్లు ఎవరైనా సరే హానికారక రసాయనాలతో పండిస్తే వారి మీద కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సాఫ్ట్య్ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్చరికలు జారీచేసింది. ఈ విష్యం మీద భారత దేశంలోని అన్ని రాష్ట్రాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు కూడా జారీచేసింది. ఎఫ్ఎస్ఎస్ ఆక్ట్, 2006 ప్రకారం ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.
పళ్ళను దూరప్రాంతాలకు తరలించే సమయంలో వాటికి నష్టం వాటిల్లకుండా, రైతులు కాయలు పచ్చిగా ఉన్నపుడే సాగు చేసి వాటిని మార్కెట్కి తరలిస్తారు. ఇక్కడి నుండి విక్రయదారులు పళ్ళను కొన్ని హానికారక రసాయనాలు ఉపయోగించి, పండేలా చేస్తారు. ఈ రష్యానాల్లో కాల్షియమ్ కార్బైడ్ ప్రధానమైనది, ఈ రసాయనం క్యాన్సర్ కారకాలను మోసుకువస్తుంది కనుక, ఈ రసాయనాన్ని వాటడం చాల ప్రమాదకరం, ఇప్పటికే చాల దేశాల్లో ఈ కెమికల్ బ్యాన్ చేసారు, అయినాసరే మన దేశంలో ధీని వినియోగం ఇంకా కొనసాగుతుంది.
ప్రస్తుతం మామిడి పళ్ళ సీజన్ నడుస్తుంది, మందిని సంప్రదాయ పద్దతిలో పండేలా చెయ్యాలంటే చాల సమయం పడుతుంది, ఆలా కాకుండా కాల్షియమ్ కార్బైడ్ లేదా అసిటీలైన్ గ్యాస్ ఉపయోగిస్తే పళ్ళు త్వరగా పక్వానికి వచ్చి మార్కెట్లో విక్రయించడానికి అనువుగా ఉంటుంది. వీటిలో ఆర్సెనిక్ వంటి ప్రమాదకరమైన మూలకాలు ఉంటాయి. ఇటువంటి పళ్ళను తిన్న తరువాత నీరసంగా అనిపించడం, ఎక్కువ దాహంగా ఉండటం, వికారం, శరీరమంతా దురద మొదలైన లక్షలను కనిపించవచ్చు, దీని ద్వారా అనేక రకములైన అనారోగ్య సమస్యలు కూడా తలైతే అవకాశం ఉంది.
ఈ హానికారక రసాయన వినియోగం వెంటనే మానుకోవాలని ఎఫ్ఎఫ్ఎస్ఏఈ హెచ్చరికలు జారీచేసింది, నిబంధనలు అతిక్రమించిన వారు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. దీని కోసం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీచేసింది. అయితే పళ్ళను ముగ్గేలా చెయ్యడానికి ఏతేలేని గ్యాస్ ఉపయోగించాలని సూచించింది.
ఏతేలేని గ్యాస్ పళ్లలో సహజంగా ఉత్పత్తవుతుంది, దీనిని కుత్రిమంగా కూడా తయారుచెయ్యవచ్చు. ఈ గ్యాస్ ను 100 పిపిఎం ల వరకు ఎటువంటి భయం లేకుండా ఉపయోగించవచ్చు. పైగా దీని వలన ఎటువంటి ప్రాణ హాని కూడా ఉండదు. మనం మార్కెట్లో కొనే పళ్లలో హానికారక రసాయనాలతో, పురుగుమందుల అవశేషాలు కూడా ఉంటాయి, వీటిని నేరుగా తినడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు తలైతే అవకాశం ఉంటుంది. కనుక బయట నుండి తెచ్చిన పళ్ళను ఉప్పునీటిలో కొంచెం సేపు ఉంచి తరవత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చెయ్యడం ద్వారా పళ్ళ మీద ఉండే రసాయనాల ఆవేశాలను తొలగించడానికి వీలుంటుంది.
Share your comments