News

పాన్ మరియు ఆధారను లింక్ చేసారా? ఆ రోజే చివరి గడువు....

KJ Staff
KJ Staff

బ్యాంకుల ద్వారా భారీ మొత్తంలో లావాదేవీలు జరపడానికి పాన్ కార్డు చాల కీలకం. పాన్ కార్డు కలిగి ఉన్నప్రతి ఒక్కరు తమ ఆధార కార్డుతో లింక్ చేసుకోవడం తప్పనిసరి. దీనికి సంబంధించి ఆదాయపు పన్నుశాఖ ఎప్పుడో ప్రకటన చేసింది. దీనికి సంభందించిన గడువు కూడా ముగియగా, ఆధార కార్డుతో లింక్ చెయ్యనివారి పాన్ కార్డు ఇప్పటికే నిరుపయోగంగా మారి ఉంటుంది. అయితే ఆదాయపు పన్ను శాఖ వారు మరొక్క సారి మీ ఆధార కార్డుతో పాన్ కార్డు లింక్ చేసుకునే అవకాశం కల్పించారు.

అయితే మే 31 లోపు ఈ ప్రక్రియను పూర్తిచెయ్యాలి. పోయినసారి ఆధార పాన్ తో లింక్ చెయ్యడానికి ఎటువంటి రుసుము వసూలుచేయ్యలేదు అయితే ఈ సారి మాత్రం 1000 రూపాయిలు లేట్ ఫీజు చెల్లించి ఈ ప్రక్రియను పూర్తిచెయ్యవలసి ఉంటుంది. ఇప్పటికీ కూడా ఈ ప్రక్రియను పూర్తిచెయ్యకుంటే, 2024 ,మార్చ్ 31 ముందు జరిపిన లావాదేవీలపై అధిక పన్ను చెల్లించాలని ఆదాయపు పన్నుశాఖ వారు ఇప్పటికే హెచ్చరించారు. చాలామంది టిసిఎస్ పన్ను చెల్లింపులు చేయనివారు ఇప్పటికే నోటీసులు అందుకున్నారని, దీనికి ప్రధాన కారణం పాన్ ఆధార్ తో లింక్ చెయ్యకపోవడమే అని పేర్కొన్నారు.

ఇకమీదట, అధిక పన్ను చెల్లించకూడదు అనుకున్న లేదా నోటీసులు అందుకోకూడదు అనుకున్న వెంటనే ఆధార్ ను పాన్ తో జోడించాలిని సూచించారు. మే 31 వరకు ఈ అవకాశం ఉన్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తిచేసినవారికి ఎటువంటి అదనపు భారం ఉండదని పేర్కొన్నారు.

అయితే మీ ఆధార్ లింక్ అయ్యిందా? లేదా కొత్తగా పాన్ కార్డు ను ఆధార తో లింక్ చేసుకోవాలనుకున్న ఇన్కమ్ టాక్స్ వెబ్సైటు లోకి వెళ్లి లింక్ ఆధార స్టేటస్ పై క్లిక్ చెయ్యాలి, దీని ద్వారా మీ పాన్ ఆధార్ తో లింక్ అయ్యిందా? లేదా? అని తెలుసుకోవచ్చు. అలాగే కొత్తగా ఈ ప్రక్రియ చేసేవారు, ముందుగా ఆలస్య రుసుమును చెల్లించాలి, దీని కోసం వెబ్సైటు లో ఈ-పే టాక్స్ పై క్లిక్ చేసి అక్కడ మీ ఫోన్ నెంబర్ మరియు పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చెయ్యాలి, తరవత ద్రువీకరణకోసం మీ ఫోన్ కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ నెంబర్ ఎంటర్ చెయ్యగానే, వివిధ పేమెంట్ ఒప్షన్స్ మీకు కనిపిస్తాయి, వాటిలో ఏదైనా ఒకటి ఎంచుకొని 1000 రూపాయిల ఫీజు చెల్లించాలి. పేమెంట్ చేసిన తరువాత వచ్చే రసీదును డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి.

ఈ ప్రక్రియ పూర్తయ్యి అప్లికేషన్ విండో ఓపెన్ కావడానికి 4-5 రోజుల సమయం పడుతుంది, ఆ తరువాత ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ వెబ్సైటు లోకి వెళ్లి లింక్ ఆధార్ పై క్లిక్ చేసి పాన్ కార్డు అనుసంధానం చేసుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine