వేసవి కాలం వచ్చింది అంటే చాలు నిమ్మకు డిమాండ్ భారీగా పెరిగిపోతుంది. ఈ వినియోగం అనేది వేసవి కాలంలో మరింతగా పెరుగుతుంది. దీనితో మార్కెట్ లో నిమ్మ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎందుకంటే నిమ్మలో అధికంగా విటమిన్ సి అనేదాన్ని కలిగి ఉంటుంది. ఎండ తాపాన్ని నుంచి బయటపడటానికి ఈ నిమ్మ బాగా ఉపయోగపడుతుంది. ఈ నిమ్మరసాన్ని ప్రజలు ఎక్కువగా మజ్జిగ మరియు షర్బత్ లో వాడతారు.
గత రెండు సంవత్సరాలుగా నిమ్మ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటె నిమ్మకు డిమాండ్ అధికంగా ఉన్న కూడా ఎక్కడ దిగుబడులు లేని పరిస్థితి. గత సంవత్సరం ఖరీఫ్ సీసన్ లో కురిసిన వర్షాల కారణంగా నిమ్మ చెట్లకు ఉన్న పూత రాలిపోయింది. దీనితో దిగుబడులు తగ్గిపోయాయి. ఒక్కో నిమ్మకాయను వ్యాపారులు 8 నుండి 10 రుపాయల వరకు అమ్ముతున్నారు. దేశంలో కోడిగుడ్ల ధరలు కన్నా నిమ్మకాయ ధరలే అధికంగా ఉన్నాయి.
ఒక కిలో నిమ్మను మార్కెట్ లో రూ.200 వరకు అమ్ముతున్నారు. నిమ్మకాయలకు డిమాండ్ ఉండి దిగుబడులు లేకపోవడంతో ధరలు ఆకాశాన్ని అంతుకుతున్నాయి. ఈ తరహాలో నిమ్మకాయలకు ధరలు పెరగడం ఎన్నడూ లేదని వినియోగదారులు బాధపడుతున్నారు. మరొకవైపు రైతులుమాత్రం ధరలు బాగున్నా దిగుబడులు లేకా ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి..
ఒక్కసారిగా తగ్గిన ధరలు.. ఆందోళనలో రైతులు
అనంతపురం జిల్లా వ్యాప్తంగా రైతులు నిమ్మపంటను 1000 హెక్టార్లలో సాగుచేస్తున్నారు. ఒక్కో హెక్టర్ నుండి సుమారుగా 20 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. నాణ్యమైన నిమ్మకాయల 36 కిలోల బస్తా రూ.7 వేల నుంచి రూ.7,500 పలుకుతోంది. మార్కెట్ లో నిమ్మకాయలను ఒక కిలో సుమారు రూ.195 నుంచి రూ.209 వరకు ధర పలుకుతుంది.
మార్కెట్ లో నిమ్మకు అధిక ధరలు పలుకుతున్న చెట్లకు కాయలు లేవని రైతులు బాధ పడుతున్నారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వలన పంటలు బాగా దెబ్బతిన్నాయి అని రైతులు చెబుతున్నారు. అమాంతంగా నిమ్మ ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూటకు రైతులు అనేక రసాయనాలను వాడిన ఉపయోగం లేకుండా పోయిందని చెబుతున్నారు. మరో రెండు నెలలు వరకు మార్కెట్ లో నిమ్మకు డిమాండ్ ఇలానే కొనసాగుతాది అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి..
Share your comments