విశాఖపట్నంలో వచ్చే నెల 3, 4వ తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జిఐఎస్) 2023 జరగనుంది. ముఖ్యంగా ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ఉన్న అవకాశాలను ప్రభుత్వం వివరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా 15 పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు సిద్ధం చేస్తుంది. దీని కొరకు రాష్ట్ర ప్రభుత్వం అడ్వాంటేజ్ ఏపీ పేరుతో ఒక వెబ్సైటు ని కూడా తయారు చేసింది.
సదస్సు మొదటి రోజు అనగా మర్చి 3వ తేదీన మొత్తం 15 రంగాలలో 9 రంగాలపై చర్చలు జరగనున్నాయి. మిగిలిన 6 రంగాల గురించి 4వ తేదీన చర్చలు జరుగుతాయి. చర్చల కొరకు వివిధ రకాల పరిశ్రమలైనా ఫుడ్ ప్రాసెస్సింగ్, టూరిజం, ఫార్మస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇటువంటి కంపెనీలకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అన్ని అవకాశాలను మరియు కంపెనీలకు వచ్చే లాభాలను వివరించడానికి ప్రత్యేక సెషన్స్ జరగబోతున్నాయి.
రాష్ట్ర ప్రభత్వం ఆంధ్రప్రదేశ్ తీరా ప్రాంతాన్ని అభివృధి చేసేందుకు అనేక రకాల ప్రాజెక్టులను చేప్పటింది. ముఖ్యంగా ఈ జిఐఎస్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ కు ఉన్న 974 కిలోమీటర్ల తీరా ప్రాంతాన్ని వినియోగించుకోవడం వలన కంపెనీలకు ఏవిధంగా నిర్వాహణ వ్యయం తగ్గుతుందో రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్ లో 6 పోర్టులు ఉన్నాయి. వీటితో పాటు 30,000 కోట్ల రూపాయలతో మరో 3 పోర్టులను నిర్మిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.
ఇది కూడా చదవండి..
హైదరాబాద్లో కొబ్బరి ఉత్పత్తుల వాణిజ్యం మరియు మార్కెటింగ్‌పై అంతర్జాతీయ సమావేశం
ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద కార్పొరేట్ కంపెనీలు అన్ని వస్తాయి. అదానీ గ్రూపు గౌతమ్ అదాని, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా, రిలయన్స్ గ్రూపునకు చెందిన ముఖేష్ అంబానీ లాంతి 22కు పైగా పెద్ద కార్పొరేట్ ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటారు అని అధికారులు తెలిపారు. ఈ సదస్సులో నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, మరియు వివిధ రంగాలకు చెందిన కేంద్ర కార్యదర్సులు ఇందులో పాల్గొంటారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్టాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉండటానికి ఇన్వెస్టర్లను పరిగణలోకి తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..
Share your comments